బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలకు సిగ్గు ఉండాలి.. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నాం అని చెప్పి లక్ష కోట్ల ప్రాజెక్ట్ కట్టారు. NDSA నివేదిక చూసి సిగ్గుపడాలి. మీరే డిజైన్ చేశారు. మీరే కట్టారు. మేడిగడ్డ సుందిళ్ల నిరుపయోగంగా ఉన్నా రికార్డు స్థాయిలో పంటలలు పడ్డాయి. కాళేశ్వరం రైతుల కోసం కాదు జేబులు నింపుకునేందుకు కట్టారు అని మండిపడ్డారు. 

హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టుకు డిజైన్ మొదలు.. నిర్మాణం, కూలిపోవడం అంతా బీఆర్ఎస్ హయాంలోనే జరిగిపోయిందన్నారు. రూ. లక్ష కోట్లకు ప్రజలను తాకట్టుపెట్టి కాళేశ్వరం కట్టారని, ప్రణాళిక లేకుండా నాసిరకం మెటీరియల్లో నిర్మించారని ఆరోపించారు. కాళేశ్వరం రైతుల కోసం కాదు.. జేబులు నింపుకోవడానికి కట్టారని మండిపడ్డారు. మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులు నిరుపయోగంగా ఉన్నా రికార్డు స్థాయిలో పంటలు పండాయని, రైతులకు బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాలని మంత్రి పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news