హార్దిక్ పాండ్యా నిశ్చితార్ధంపై అతని తండ్రి సంచలన వ్యాఖ్యలు…!

-

టీం ఇండియా యువ క్రికెటర్ హార్దిక్ పాండ్యా నిశ్చితార్ధం గురించి తమకు ఏం తెలియదు అంటూ అతని తండ్రి సంచలన వ్యాఖ్యలు చేసారు. వివరాల్లోకి వెళితే ఇటీవల హార్దిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ నటాషాతో నిశ్చితార్ధం చేసుకోగా ఆ వీడియోని నటాషా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతూనే ఉంది. దుబాయ్ లో వీరి నిశ్చితార్ధం జరిగినట్టు తెలిసింది.

అయితే ఈ కార్యక్రమం కూడా కాస్త వింతగా జరిగింది. ఎవరిని ఆహ్వానించకుండా వాళ్ళు ఇద్దరే చేసుకోవడం హాట్ టాపిక్ అయింది. దీనిపై హార్దిక్ పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా మాట్లాడుతూ… నటాషా మంచి అమ్మాయన్నారు. ముంబయిలో చాలా సందర్భాల్లో మేం ఆమెను కలిశామని చెప్పుకొచ్చారు. కొత్త సంవత్సరం సందర్భంగా వారిద్దరూ దుబాయ్‌కి వెళ్తున్నారని తమకు తెలుసు అని చెప్పిన ఆయన,

నిశ్చితార్ధం గురించి మాత్రం అస్సలు తెలియదు అంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ ఘటన మమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. వారిద్దరికీ నిశ్చితార్ధమైన తర్వాతే మాకు తెలిసింది అని చెప్పారు. పెళ్లి ఎప్పుడు జరిపించాలో ఇంకా నిర్ణయించలేదన్న ఆయన… త్వరలోనే ముహూర్తం నిర్ణయిస్తామని శనివారం ఆయన మీడియాకు తెలిపారు. దీనితో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news