అతను మెసేజ్ చేసే పద్దతిని బట్టి అతనికి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో తెలుసుకోండి

-

Texting అనేది ఈ రోజుల్లో చాలా సాధారణం అయిపోయింది. చిన్న చిన్న విషయాల నుండి పెద్ద పెద్ద సంగతులు వరకు అన్నింటిని మెసేజ్ ల రూపంలో అవతలివారికి కమ్యూనికేట్ చేస్తున్నారు.

మెసేజ్ చేయడాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ఎమోజీస్ వంటివి అందుబాటులో ఉన్నాయి. మెసేజ్ చేసే పద్ధతిని బట్టి వాళ్లకు మీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవచ్చు.

మీరు అమ్మాయి అయితే అతను మెసేజ్ చేసే పద్ధతిని బట్టి అతను మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ తో ఉన్నాడో తెలుసుకోవచ్చు.

తరచుగా మెసేజ్ చేస్తుంటే:

రెగ్యులర్ గా మీకు అతను మెసేజ్ చేస్తుంటే మీతో మాట్లాడటం అతనికి ఇంట్రెస్టింగ్ గా ఉందని అర్థం చేసుకోవచ్చు. మీతో టచ్ లో ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాడని, మీతో మాట్లాడటాన్ని ఎంజాయ్ చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు.

వ్యక్తిగత విషయాలు అడుగుతుంటే:

మీ భవిష్యత్తు ఆలోచనలు, జీవితం మీద అభిప్రాయాలు అడుగుతున్నారంటే మీతో ఎక్కువ రోజులు స్నేహం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఇలా అడిగేవాళ్లు ఒక్కోసారి జీవితం మీద తమ అభిప్రాయాలను, తాము సాధించాలనుకున్న లక్ష్యాలను కూడా మీకు చెబుతూ ఉంటారు.

షార్ట్ గా మెసేజ్ చేస్తుంటే:

మీరు అడిగిన దానికి షార్ట్ గా సమాధానాలు చెబుతుంటే రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి.. మీకు మెసేజ్ చేయడం ఇంట్రెస్ట్ లేదని అనుకోవచ్చు.
రెండవది.. మీరు ఏది అడిగినా కూడా క్షణంలోనే షార్ట్ గా రిప్లై ఇస్తుంటే.. మీతో మాట్లాడటం ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎలా మాట్లాడాలో తెలియకపోవడం అయ్యుండొచ్చు.

రాత్రి 10 దాటిన తర్వాత మెసేజ్ చేస్తే:

రాత్రి పది అవుతున్నా మీకు మెసేజ్ చేస్తున్నాడంటే.. మీకు మెసేజ్ చేయడంలో, మీతో రిలేషన్ పెంచుకోవడంలో ఎలాంటి అసౌకర్యం ఫీల్ అవ్వడం లేదని అర్థం చేసుకోవచ్చు. అలాగే మీతో చాలా ఓపెన్ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకోవచ్చు.

ఆలస్యం, ఒకే పదంతో జవాబులు:

మీరు ఏదైనా మెసేజ్ చేసినప్పుడు లేటుగా రిప్లై ఇవ్వడమే కాకుండా కేవలం ఒకే ఒక్క పదంతో మెసేజ్ చేస్తే నీ మీద అతనికి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని అర్థం చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version