తెలుగు ప్రేక్షకుల్ని మలయాళం సినిమాలు ఈ మధ్యకాలంలో ఎంత గానో ఆకట్టుకుంటున్నాయి. మలయాళం సినిమాల మీద తెలుగు ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు. మలయాళం మూవీస్ చిన్న సినిమాలో రిలీజ్ అయ్యి భారీ విజయాలని అందుకుంటున్నాయి. మలయాళం లో ఈ మధ్య సూపర్ హిట్ అయిన సినిమాల్లో జయ జయ జయ జయహే సినిమా ఒకటి. ఈ మూవీ 2022లో మలయాళం ప్రేక్షకులు ముందుకి వచ్చింది. ఈ మూవీలో బాసిల్ జోసెఫ్ రాజేంద్ర హీరో హీరోయిన్స్ గా నటించారు.
ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ కమర్షియల్ గా భారీ హిట్ ని అందుకుంది కేవలం ఐదు కోట్ల రూపాయలతో తెరకెక్కినఈ మూవీ 45 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు ఈ మూవీలో జయ పాత్రలో దర్శన రాజేంద్రన్ తన యాక్టింగ్ తో ప్రేక్షకుల్ని మెప్పించింది భర్త పెట్టే చిత్రహింసలని భరించలేక అతని మీద ఎదురు తిరిగే భార్య పాత్రలో దర్శన రాజేంద్రన్ అద్భుతంగా నటించి అందర్నీ ఆకట్టుకుంది.