‘అర్ఆర్ఆర్ ను చూసి హాలీవుడ్ నేర్చుకోవాలి..’ బ్రిటన్ నటుడు జేమీ హ్యారిస్

-

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో 2022లో రిలీజ్ అయిన త్రిబుల్ ఆర్ మూవీ ఎంతటి ఘనవిజయాన్ని ప్రపంచవ్యాప్తంగా సాధించిందో అందరికీ తెలిసిందే. ఏ భారతీయ చిత్రం కూడా అందుకోలేని అవార్డులను ఈ చిత్రం కైవసం చేసుకుంది. త్రిబుల్ అర్ మూవీ విడుదలై ఏడాది పైనే అవుతున్నప్పటికీ ఇంకా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు ఇప్పటికే ఈ సినిమా పలు అవార్డులను సొంతం చేసుకున్న నేపథ్యంలో తాజాగా బ్రిటన్ నటుడు జేమీ హ్యారిస్ ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

అర్ఆర్ఆర్ సినిమా విడుదలై ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ తో పాటు ఆస్కార్ అవార్డులను సైతం సొంతం చేసుకుంది. భారతీయ సినీ ఇండస్ట్రీలోని కొత్త రికార్డును నెలకొల్పింది. కాగా ఇప్పటికే పలువురు హాలీవుడ్ నటులు నిర్మాతలు దర్శకులు ఈ సినిమాను పొగడ్తలతో ముంచెత్తగా తాజాగా బ్రిటన్ నటుడు జేమీ హ్యారిస్ ఈ సినిమాపై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు.

'RRR' movie update: Makers release new poster, only 2 songs left to shoot

ఈ సినిమా గురించి మాట్లాడుతూ త్రిబుల్ ఆర్ మూవీ ఎంతో బావుందని.. రాజమౌళి అత్యంత అద్భుతంగా ఈ సినిమా రూపొందించారని, చరణ్ తారక్ ఇద్దరూ కూడా సమానంగా నటించి ఈ సినిమాని మరొక స్థాయికి తీసుకు వెళ్లారని ఆయన కొనియాడారు. ఆర్ఆర్అర్ లాంటి సినిమాను హాలీవుడ్లో సైతం తీయటానికి ప్రముఖ దర్శకులు సిద్ధమవుతున్నారని అన్ని రకాల అంశాలను కలిపి ఒకే విధమైన సినిమాగా రూపొందించడం అత్యంత కష్టమైన పనని కానీ ఈ విషయాన్ని రాజమౌళి చేసి చూపించారని అన్నారు అలాగే ఈ సినిమాను చూసి హాలీవుడ్ దర్శకుడు సైతం ఎంతో నేర్చుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news