ఏడాది లోపే ఎన్నికలు..ఎమ్మెల్యేలతో జగన్ సెంటిమెంట్!

-

మొత్తానికి వైసీపీ వర్క్ షాప్ మొదలైంది..కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు గాని..మిగిలిన వారితో జగన్ వర్క్ షాప్ మొదలుపెట్టారు. అదే సమయంలో ఏడాది లోపే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా జగన్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారని, 21 స్థానాల్లో ఎన్నికలు వస్తే .. అందులో 17 స్థానాల్లో వైసీపీ గెలిచిందని, ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి అన్నారు.

ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారని, అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి మాత్రమేనని,  ఆ పరిధిలో 87శాతం అంటే.. అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయని, అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎవరికైతే మంచి చేశామో… వారు ఎమ్మెల్సీ ఓటర్లలో చాలా తక్కువని, కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారని జగన్ తెలిపారు.

YS Jagan

టీడీపీ ఒక వాపును చూపించి.. అది బలం అని చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని తాను అనుకోనని,  ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోనని, మీతో పనిచేయించి మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు జగన్ ఎమ్మెల్యేలకు వివరించారు.

ప్రజల్లో మీ గ్రాఫ్‌ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టమని, మనం అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారని, అందుకే మన గ్రాఫ్‌ పెంచుకోవాలని అన్నారు. అయితే ఎమ్మెల్యేలని వదులుకోను అంటూ వారిని సెంటిమెంట్ తో కట్టడి చేస్తున్నట్లు కనిపించింది. ఇక వైసీపీ మళ్ళీ గెలవకపోతే ప్రజాలకు నష్టమనేది జగన్ ఏ విధంగా చెప్పారనేది అర్ధం కాకుండా ఉంది. మరి ప్రజలు కూడా అలాగే భావిస్తున్నారో లేదో..నెక్స్ట్ ఎన్నికల్లో తేలే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news