హోం లోన్ వడ్డీ ఏ బ్యాంకు లో తీసుకుంటే మంచిది…?

-

చాలా మందికి సొంత ఇల్లు అనేది ఒక కల. సొంత ఇంట్లో ఉండటం కోసం రూపాయి రూపాయి దాచుకుని ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు వారి కోసం బ్యాంకు లు అన్నీ కూడా హోం లోన్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. చాలా బ్యాంకు లు ఇప్పుడు కష్టమర్లను ఆకట్టుకోవడానికి గానూ వడ్డీ రేట్లకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నాయి. వడ్డీ రేటు లో కొంచెం తేడా ఉన్నా సరే భారీగా లోన్ చెల్లించాలి.

వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు ఏ బ్యాంక్‌లో తక్కువగా ఉంటే ఆ బ్యాంక్‌లో లోన్ తీసుకోవడం మంచిది. బ్యాంకు ప్రాతిపదిక ఆధారంగా ఇప్పుడు వడ్డీ ప్రభావితం అవుతుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంకులు అన్నీ కూడా ఒకటే వడ్డీ రేటుకి రుణాలు ఇస్తున్నాయి. వడ్డీ రేటు 7.2 శాతం నుంచి ఉండగా ప్రాసెసింగ్ ఫీజు 0.35 – 0.5 శాతం వరకు ఉంటుంది.

కెనరా బ్యాంక్‌ 7.30 శాతం నుంచి, ఇండియన్ బ్యాంక్‌ 7.4 శాతం నుంచి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ 7.45 శాతం నుంచి, ఐడీబీఐ బ్యాంక్‌ 7.9 శాతం నుంచి, యూకో బ్యాంక్‌ 7.85 శాతం నుంచి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 7.95 శాతం నుంచి సౌత్ ఇండియన్ బ్యాంక్‌ 8.05 శాతం నుంచి, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్రలో 7.45 శాతం నుంచి గృహ రుణాలకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. స్టేట్ బ్యాంకు లో లోన్ తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news