దేశవ్యాప్తంగా లాక్డౌన్ 3.0 సోమవారం నుంచి అమలులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్రం పలు ఆంక్షలను సడలించగా.. అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం మద్యాన్ని కూడా విక్రయిస్తున్నారు. ఇక అనేక చోట్ల మందు బాబులు మద్యం దుకాణాల ఎదుట కిలోమీటర్ల మేర క్యూలైన్లలో మద్యం కొనుగోలు చేసేందుకు బారులు తీరారు. దీంతో సామాజిక దూరం అనే నిబంధన పటాపంచలైంది. ఇక పలు చోట్ల తోపులాటలు జరగడంతో పోలీసులు వైన్ షాపులను తాత్కాలికంగా మూసివేయించారు. అయితే కర్ణాటకలో మాత్రం మద్యం షాపులను మళ్లీ తెరవడంతో మందు బాబులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
కర్ణాటకలోని కోలార్ అనే చిన్న పట్టణంలో మద్యం ప్రియులు దుకాణాల ఎదుట బాణసంచా కాల్చి తమ ఆనందం వెలిబుచ్చారు. చాలా రోజుల తరువాత మళ్లీ మద్యం షాపులు ఓపెన్ కావడంతో వారు ఆ ఆనందాన్ని పట్టలేక టపాసులు కాల్చారు. దీంతో ఆ సమయంలో తీసిన వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Wine Shop reopening – Crackers fest
Celebration of life. Some place in #Karnataka. #IndiaFightsCorona pic.twitter.com/FtXh2OTG8g
— …. (@ynakg2) May 4, 2020
కాగా అనేక చోట్ల ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మద్యం దుకాణాలకు పర్మిషన్ ఇవ్వగా, తెలంగాణలో మాత్రం ఇంకా మద్యం అమ్మకాలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మంగళవారం జరగనున్న క్యాబినెట్ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.