పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ప్రారంభించిన హోమ్ మినిస్టర్ అమిత్ షా

-

హోమ్ మినిస్టర్ అమిత్ షా మధ్యప్రదేశ్‌లోని మొత్తం 55 జిల్లాల్లో ‘ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్’ని వర్చువల్‌గా ప్రారంభించారు.ఈ సందర్భంగా 2047 నాటికి ఇండియాని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో కొత్త విద్యా విధానాన్ని తీసుకురావడంలో నరేంద్ర మోడీ దూరదృష్టిని అమిత్ షా ప్రశంసించారు.

ఆదివారం ఇండోర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్‌లో పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తప్పనిసరిగా కొత్త విద్యా విధానం(ఎన్ఈపీ) డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు. వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు అని వెల్లడించారు.

ఎన్ఈపీ విద్యార్థులను వారి సంస్కృతిని దూరం చేయకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా ఉంటుంది అని వెల్లడించారు. ఇది నాణ్యతపై దృష్టి పెడుతుందని అన్నారు. ఎన్ఈపీ కింద ఏర్పాటైన పీఎం ఎక్స్‌లెన్స్ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news