దేశాన్ని మొత్తం నాగాలాండ్ సంఘటన కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే…. తాజాగా… నాగాలాండ్ ఘటనపై లోక్‌సభ వేదిక గా కేంద్ర హోం మంత్రి శాఖ అమిత్ షా వివరణ ఇచ్చారు. ఉగ్రవాదులనే అనుమానం తోనే కాల్పులు జరిపారని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నాగాలాండ్ లో ప్రస్తుతం పరిస్థితి అదుపు లోనే ఉందన్నారు అమిత్ షా.
ప్రాథమిక విచారణ లో పొరపాటున కాల్పులు జరిపారని తేలిందని ఆయన వివరణ ఇచ్చారు. భవిష్యత్తు లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. నాగాలాండ్ ఘటన పై సిట్ ఏర్పాటు చేస్తామని అమిత్ షా వెల్లడించారు. దీనిపై ప్రతి పక్షాలు చేస్తున్న వాదనలు చాలా తప్పదమని మండి పడ్డారు. ఇక ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా చూస్తామన్నారు. కాగా… ఇటీవలే.. భద్రతా బలగాల చేసిన కాల్పుల్లో… 13 మంది అమాయక ప్రజలు… నాగాలాండ్ లో మరణిచిన సంగతి తెలిసిందే.