బాలీవుడ్ నటుడు, హెల్పింగ్ స్టార్.. సోనూసూద్ కు మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. నటుడు సోనూసూద్ కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. వసతి గృహం కోసం నిర్మించిన ఆరు అంతస్తుల.. భవనాన్ని హోటల్ గా మార్చారని.. సోనూసూద్ కు మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది.
కోర్టు ఆదేశం మేరకు అక్రమంగా హోటల్ గా మార్చిన ఆరు అంతస్తుల భవనాన్ని.. తిరిగి రెసిడెన్షియల్ భవంతి గా మార్చుతానని గతంలో సోనూసూద్ మాట ఇచ్చారని.. దానిని ఇంకా నిలబెట్టుకోలేదంటూ.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు పంపింది. దీనిపై వెంటనే స్పందించి.. బిల్డింగ్ ను కొనసాగించాలని సోనూసూద్ కు వార్నింగ్ ఇచ్చింది బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్.