బాలీవుడ్ టు శాండల్‌వుడ్ .. ఏ ఇండస్ట్రీ తీసుకున్నా డ్రగ్స్ కలకలం. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీని వెనక బంధు ప్రీతి వుందని, అవకాశాల్ని రానివ్వలేదని, కావాలనే కొంత మంది సుశాంత్‌ని టార్గెట్ చేశారంటూ ప్రచారం జరిగింది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ కు ముంబై డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని తేలడంతో కథ కొత్త మలుపు తిరిగింది. నార్వోటిక్స్ డిపార్ట్‌మెంట్ రంగంలోకి దిగడంతో తీగ లాగితే డొం కదలడం మొదలైంది.
రియా డ్రగ్ ప్రకంపణలు బాలీవుడ్‌ని వణికిస్తున్న వేళ బెంగళూరు కేంద్రంగా శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కలకలం మొదలైంది. కన్నడ చిత్ర సీమకు చెందిన పలువురు కీలక నటీనటులు డ్రగ్స్ వాడతారని, సంగీత దర్శకులకు కూడా డ్రగ్స్ అలవాటు వుందని తేలడంతో రాగిణి దివ్వేదిని సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. సోమవారం విచారణ చేపట్టిన సీసీబీ పోలీసులకు రాగిణి దివ్వేది సహకరించకుండా చుక్కలు చూపించిందట. ఇక తాజాగా మరో నటి సంజన గల్రానీకి కూడా డ్రగ్స్‌తో సంబంధాలున్నాయని తేలడంతో ఆమె నివాసంలో సోమవారం సోదాలు మొదలయ్యాయి.
ప్రస్తుతం ఈ అంశం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. బాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్ అంటూ తేడా ఏమీ లేదని వెండితెర మత్తులో తూగుతోందని తాజా పరిణామాలు వెల్లిస్తున్నాయి. 2017లో టాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. దీంతో రంగంలోకి దిగిన అకూన్ సబర్వాల్ టాలీవుడ్ బిగ్గీస్‌ని విచారించడం అప్పట్లో సంచలనంగా మారింది. పూరి జగన్నాథ్, చార్మి, శ్యామ్ కె. నాయుడు, సుబ్బరాజు, రవితేజ, తరుణ్, నవదీప్ వంటి వారిని విచారించారు.
ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ ఈ కేసు కంచికి చేరింది. కానీ ప్రస్తుతం బాలీవుడ్, శాండల్‌వుడ్ వేదికగా జరుగుతున్న డ్రగ్ సోదాలు ఫిల్మ్ ఇండస్ట్రీల్లో వున్న డ్రగ్ కల్చర్‌ని క్లీన్ చేయడానికే జరుగుతున్నాయని కర్ణాటక హోం మంత్రి బపసవరాజ బొమ్మై చెప్పడం ఆసక్తిగా మారింది. దేశంలో మొట్టమొదటి సారి మాదక ద్రవ్యాలని పూర్తి స్థాయిలో అడ్డుకునే దిశగా పోలీసులు కార్యచరణను రూపొందించి అందుకు అనుగునంగానే అడుగులు వేస్తున్నారని, ఈ విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చామరి కర్ణాటక సీఎం యాడ్యూరప్ప వివరించడం కొత్త చర్చకు తెరతీస్తోంది. క్లీన్ అనే స్టోగన్‌లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నారనే వాదనకు బలం చేకూరుతోంది.