ఫ్లిప్‌కార్ట్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ డేస్ సేల్‌.. ఫోన్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌లు..!

-

ఈ-కామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త‌న సైట్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ డేస్ పేరిట ఓ ప్ర‌త్యేక సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా స్నాప్‌డ్రాగ‌న్ ప్రాసెస‌ర్ ఉన్న ఫోన్ల‌ను తగ్గింపు ధ‌ర‌ల‌కు అందిస్తున్నారు. ఈ సేల్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా ఈ నెల 10వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో స్నాప్ డ్రాగ‌న్ ప్రాసెస‌ర్ ఉన్న ఫోన్ల‌పై ఆక‌ట్టుకునే ఆఫ‌ర్లు, రాయితీల‌ను అందిస్తున్నారు.

snapdragon days sale in flipkart offers discounts on smart phones

సేల్‌లో భాగంగా షియోమీకి చెందిన రెడ్‌మీ కె20 ఫోన్‌ను రూ.21,999 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు. అలాగే ఈ ఫోన్‌పై రూ.2వేల వ‌ర‌కు అద‌న‌పు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. సేల్‌లో రియ‌ల్‌మి ఎక్స్‌2 ప్రొ ఫోన్‌పై రూ.4వేల వ‌ర‌కు అద‌న‌పు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. పోకో ఎక్స్‌2 ఫోన్‌పై 7 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

వివో జ‌డ్‌1 ప్రొ ఫోన్‌పై 14 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. మోటో రేజ‌ర్ ఫోల్డ‌బుల్ ఫోన్‌పై రూ.30వేల వ‌ర‌కు డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. వివో జ‌డ్‌1ఎక్స్ ఫోన్‌పై 24 శాతం వ‌ర‌కు, ఒప్పో ఎ9 ఫోన్‌పై 26 శాతం వ‌ర‌కు రాయితీ పొంద‌వ‌చ్చు. అలాగే రియ‌ల్ మి ఎక్స్ పై రూ.17వేల వ‌ర‌కు అద‌న‌పు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను ఇస్తున్నారు. శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎ71పై 11 శాతం వ‌ర‌కు, ఒప్పో ఎ52 పై 15 శాతం వ‌ర‌కు, వివో వై50పై 10 శాతం వ‌ర‌కు, ఎక్స్‌50పై 12 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ల‌ను పొంద‌వ‌చ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్‌10 లైట్‌పై 2 శాతం, రియ‌ల్‌మి ఎక్స్‌3 సూప‌ర్ జూమ్‌పై 5 శాతం వ‌ర‌కు డిస్కౌంట్‌ను, వివో ఎక్స్‌50 ప్రొపై 9 శాతం అద‌న‌పు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news