దారుణం: ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థిని గ‌ర్బ‌వ‌తిని చేసిన కీచ‌క ఉపాధ్యాయుడు..

-

విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడుగా మారాడు. అభం శుభం తెలియని బాలిక‌పై
అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కీచ‌క ఉపాధ్యాయుడి పైశాచికత్వానికి ఆ మైనర్ బాలిక గర్భవతి అయ్యింది. అలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే… విజయనగరం జిల్లా గంట్యాడ మండలానికి చెందిన పదో తరగతి విద్యార్థిని(16)..
కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో మూడేళ్ల గా ఓ ట్యూషన్‌ సెంటర్‌కు వెళుతోంది. ఈ క్ర‌మంలో ఆ అమ్మాయిపై ట్యూషన్‌ కన్నేశాడు మాస్టారు చిన్నా. మిగిలిన విద్యార్థులంతా సెంట‌ర్ నుంచి వెళ్లిపోయాక.. స్పెష‌ల్ కాస్లులంటూ.. ఆ బాలిక‌ను లోబరుచుకున్నాడు.ఇలా ఏడాది కాలంగా ఆమెపై లైంగికదాడికి ప‌డ్డాడు ట్యూషన్‌ మాస్టారు చిన్నా.

అయితే.. గ‌త కొన్ని రోజులుగా బాలిక సరిగా తినకపోవడం, నీరసంగా ఉండటంతో అందోళ‌న గురైన ఆ బాలిక త‌ల్లిదండ్రులు ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. కాగా.. బాలిక‌ను ప‌రీక్షించిన వైద్యులు పిడుగులాంటి వార్త చెప్పారు. ఆ బాలిక ఎనిమిది నెల గర్భవతి అని చెప్పారు. దీంతో బాలికను కుటుంబసభ్యులు నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వెంటనే ఆ బాలిక త‌ల్లిదండ్రులు దిశ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడు చిన్నాను అదుపులోకి తీసుకున్నారు. ఆ కామాంధుడికి అప్పటికే పెళ్లైంది. ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో ట్యూషన్లు చెప్పుతున్నాడ‌ని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version