వావ్ ఈ స్మార్ట్ హోమ్ క్లీనర్ ని ఎప్పుడైనా చూసారా..?

-

ఇటీవల కాలం లో క్లీనింగ్ డివైజెస్ ఎన్నో వచ్చాయి. కొవిడ్‌ భయం తో మరెంత స్మార్ట్ గా మారుతున్నాయి. ప్రతీ ఒక్కరు కూడా స్మార్ట్‌హోమ్‌లా మార్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఇంటి పని వారి స్థానం లో స్మార్ట్‌ హోమ్‌ డివైజ్‌లు పెరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటె గతం లో ఎక్కడో ఒక చోట ఈ డివైజ్‌లని ఉపయోగించే వారు కానీ ఇప్పుడు అయితే చాలా మంది తమ ఇళ్లలోకి ఇవి చేరుతున్నాయి. దీనితో ఇంటి పని కూడా ఎంతో సులభంగా అయిపోతోంది.

ఇంటి పని కోసం వ్యక్తులను పని లో పెట్టుకోవడానికి భయం పడి కూడా వీటిని ఉపయోగించడం జరుగుతోంది . ఇవి ఉండడం వల్ల వేరే వారి మీద ఆధార పడక్కర్లేదు కూడా. ఇలా అనేక కారణాల వల్ల ఇంటిని పరిశుభ్రం చేసేందుకు వాక్యూమ్‌ క్లీనర్‌ పై ఆధార పడుతున్నారు. వీటి ధర పెరుగుతున్న కొద్ది వాటిలో ఫీచర్లు, పని తీరు కూడా పెరుగుతోంది. ఇప్పటి కాలం లో ట్రిఫో, దశాంతా క్లారా వాక్యూమ్‌ క్లీనర్లు అయితే తగ్గిపోయాయి.

ఇక ట్రిఫో విషయానికి వస్తే.. వాక్యూమ్‌ క్లీనర్‌ ఒకింత రోబోట్‌, కొద్దిగా దీనికి సెక్యూరిటీ కెమెరా కూడా ఉంటుంది. దీనికి అర లీటరుకు మించి చెత్తను సేకరించగలిగే డస్ట్‌ బిన్‌ ఉంది. దీనికి రెండు గంటల మేరకు బ్యాటరీ లైఫ్ కూడా ‌ఉంది. దీనిని కనుక ఆపరేట్ చెయ్యాలంటే అలెక్సా సపోర్ట్‌ తో మొబైల్‌ యాప్‌ ద్వారా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఏది ఏమైనా నేటి కాలం లో గిన్నెల శుభ్రం నుంచి వివిధ ఇంటి పనులకు రోబోట్‌తో పాటు మొబైల్‌తో పనులు చక్కపెట్టే వస్తువులకు గిరాకీ కూడా బాగా పెరిగింది అనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news