జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల కమిషన్‌ గెజిట్‌ విడుదల

Join Our Community
follow manalokam on social media

అందరూ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై ఎన్నికల కమిషన్‌ గెజిట్‌ విడుదల చేసింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల గెజిట్‌ ని ఈరోజు రిలీజ్ చేసింది. గతేడాది డిసెంబర్‌ 1న గ్రేటర్‌ ఎన్నికలు జరిగాయి. 4న ఫలితాలు కూడా వచ్చాయి. ఐతే ప్రస్తుత పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఇది ముగిసిన తర్వాతే కొత్త  పాలకమండలి కొలువుదీరే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం కొత్త కార్పొరేటర్ల పేర్లతో గెజిట్‌ ప్రకటించింది.

గెజిట్‌ విడుదల కావడంతో నెల రోజుల్లోపు గెలిచిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో కొత్త  కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే సమావేశంలో మేయర్‌, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుంది. మొన్న జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌-56, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్‌ రెండు  స్థానాల్లో విజయం సాధించాయి.  

TOP STORIES

ఖాతాదారులకు అలర్ట్‌ చేసిన ఎస్‌బీఐ

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు ఆన్‌లైన్‌ యూపీఐ మోసాలు పట్ల అలర్ట్‌ చేసింది. ట్వీట్టర్‌...