తాను ఓ సాధారణ హోం గార్డ్..! కానీ దేశం అంటే అంతులేని ప్రేమ.. దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధపడతాడు అతడే కర్ణాటకలోని రాయచూరు జిల్లాకు చెందిన మాదివాల లక్ష్మణ్. దేశం పై తనకున్న భక్తిని చాటుతూ యుద్ధం గనుక జరిగితే యుద్ధంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలంటు భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ కు తన రక్తంతో లేఖ రాశాడు. గాల్వాన్ లోయలో జరిగిన మారణఖాండతో భారత్ చైనాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేని పరిస్థితులు ఉన్నాయి. బార్డర్ల వద్ద సైనిక బలగాలు ఒక్కతాటికి చెరీ ట్యాంకర్లు ఆయుదాలు సిద్ధం చేస్తున్నారు.. దేశాల మధ్య సంబంధాలు దీనమైన స్థితికి చేరాయి యుద్ధం సంతరిస్తుందేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ నేపద్యంలో యుద్ధం గనుక జరిగితే భారత ఆర్మీ తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించమని లక్ష్మణ్ రాష్ట్రపతికి రక్త లేఖ రాశాడు. లక్ష్మణ్ హోమ్ గార్డ్ విధులు నిర్వహిస్తూనే గ్రామంలోని పిల్లలకు సైన్స్ మ్యాథ్స్ టీచర్ గా పాఠాలు భోదిస్తున్నాడు. తాను వైద్యుల సూచనలు తీసుకొని ఈ లేఖ రాశానని చెబుతున్నాడు.
”నన్ను ఆర్మీలో చేర్చుకోండి” రాష్ట్రపతికి హోం గార్డ్ రక్తపు లేఖ..!
-