సంక్షేమ పథకాలతో దూసుకెళ్తున్న జగన్ సర్కార్.. మరో ముందడుగు వేసింది. కరోనాతో ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా ప్రజల కోసం వినూత్న పథకాలను అమలు చేస్తోంది. తాజాగా మహిళల కోసం మరో వినూత్న పథకం ‘వైయస్సార్ కాపు నేస్తం’కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా అర్హులైన కాపు మహిళలకు ఏడాదికి 15వేల రూపాయల చొప్పున 5 ఏళ్లలో మొత్తం 75 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందనుంది. ఈ పథకం ద్వారా ఏడాదికి రూ.353.81 కోట్లు ఖర్చు చేయనున్నారు.
అలాగే మొత్తం 2.36 లక్షల మంది మహిళలు లబ్ధిపొందనున్నరు. 2019-20కి సంబంధించి ఈనెల 24వ తేదీన ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకానికి అర్హత సాధించాలంటే.. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలకు మించి ఉండరాదు.