బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించింది హీరోయిన్ హనీ రోజ్. ఈ చిత్రం బాలయ్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. మలయాళం బ్యూటీ అయినప్పటికీ హనీ రోజ్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాలో హనీ రోజ్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా బాలయ్య మరదలుగా తల్లిగా నటించడంతో బాగా ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే, తాజాగా ఈ బ్యూటీ విజయవాడలోని ఓ బేకరీ ఓపెనింగ్ కు వెళ్ళింది. అక్కడి అభిమానులతో కాసేపు ముచ్చటించింది. ఈ నేపథ్యంలోనే హనీ రోజ్ ను అభిమానులు పెళ్లి గురించి అడిగారు. పెళ్లి ప్రశ్నపై హనీ స్పందిస్తూ పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత. ఆ బాధ్యతకు తను సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. వివాహబంధం బలంగా ఉండటం కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పుకొచ్చింది. వీటితోపాటు నటనపై తనకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేదని చెప్పింది. ఇక ఇప్పుడు ఆమె వయస్సు ఎంత అనే విషయం వైరల్ గా మారింది. ప్రస్తుతం హనీ రోజ్ వయస్సు 31 అట.