జూపల్లి-పొంగులేటి బలమెంత..ఎవరికి లాభం.!

-

బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అసలు ఆ పార్టీలో తమకు ప్రాధాన్యత లేకపోవడంతో ..ఆ ఇద్దరు నేతలు పార్టీకి దూరం జరిగి..వ్యతిరేకంగా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో వారిని బి‌ఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ చేశారు. అయితే చిన్నాచితక నేతలని సస్పెండ్ చేస్తే పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ జూపల్లి, పొంగులేటి వారికి ప్రజా బలం ఉంది.

అందుకే వారు సస్పెండ్ కావడంపై చర్చ నడుస్తోంది. అలాగే వారు ఏ పార్టీలోకి వెళ్తారు? లేదా కొత్త పార్టీ పెడతారా? అనే ప్రచారం ఉంది. వాస్తవానికి బి‌ఆర్‌ఎస్ నుంచి సస్పెండ్ కావడం వల్ల జూపల్లి, పొంగులేటికి నష్టమేమీ లేదు..సస్పెండ్ అయినందుకు వారు హ్యాపీ..కానీ బి‌ఆర్‌ఎస్ పార్టీకే నష్టం. ఎందుకంటే జూపల్లికి కొల్లాపూర్ లో ప్రజా మద్ధతు ఉంది. ఆయనకు సొంత బలం ఉంది. ఇంకా సర్పంచ్‌లు, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, కొల్లాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలరు..ఇలా పలువురు మద్ధతు ఉంది. అంతే కాదు పాలమూరు జిల్లాలో ఆయన అనుచరులు ఎక్కువగానే ఉన్నారు. అంటే జూపల్లికి ప్రజా బలం ఉంది.

ఇటు ఖమ్మంలో పొంగులేటికి పట్టు ఉంది. 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచారు. అలా గెలవడానికి సొంత ఇమేజ్ కూడా కారణమే. ఇప్పటికే ఆయన జిల్లాలో ఉన్న తన అనుచరులని ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి నాయకులు పొంగులేటి అనుచరులుగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పది స్థానాల్లో తమ అనుచరులని దింపాలని పొంగులేటి చూస్తున్నారు. అంటే ఇటు ఖమ్మంలో పొంగులేటి బలం ఉంది.

జూపల్లి, పొంగులేటికి బలం ఉంది కాబట్టే..ఆ ఇద్దరు నేతల కోసం అటు బి‌జే‌పి, ఇటు కాంగ్రెస్ పార్టీలు ట్రై చేస్తున్నాయి. తమ పార్టీల్లోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఇక వారిద్దరు ఏ పార్టీలోకి వెళితే..ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news