పెళ్లికి సిద్దమైన హనీరోజ్..వరుడు ఎలా ఉండాలంటే?

-

బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమాలో నటించింది హీరోయిన్ హనీ రోజ్. ఈ చిత్రం బాలయ్య కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లను రాబట్టింది. మలయాళం బ్యూటీ అయినప్పటికీ హనీ రోజ్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాలో హనీ రోజ్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా బాలయ్య మరదలుగా తల్లిగా నటించడంతో బాగా ఆకట్టుకుంది.

ఇదిలా ఉంటే, తాజాగా ఈ బ్యూటీ విజయవాడలోని ఓ బేకరీ ఓపెనింగ్ కు వెళ్ళింది. అక్కడి అభిమానులతో కాసేపు ముచ్చటించింది. ఈ నేపథ్యంలోనే హనీ రోజ్ ను అభిమానులు పెళ్లి గురించి అడిగారు. పెళ్లి ప్రశ్నపై హనీ స్పందిస్తూ పెళ్లి అనేది ఓ పెద్ద బాధ్యత. ఆ బాధ్యతకు తను సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. వివాహబంధం బలంగా ఉండటం కోసం నేను ఏమైనా చేస్తానని చెప్పుకొచ్చింది. వీటితోపాటు నటనపై తనకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేదని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news