లాస్ట్ డేట్ టుడే: తెలంగాణాలో 1,601 ఉద్యోగాలకు అప్లై !

-

తెలంగాణ స్టేట్ సథరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నుండి ఇటీవల కొన్ని ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణాలో మొత్తం 1601 ఉద్యోగాలు పొందే అవకాశాన్ని యువతీ యువకులకు విద్యుత్ శాఖ కల్పించింది. ఈ పోస్ట్ లలో జూనియర్ లైన్ మెన్ లు 1553, అసిస్టెంట్ ఇంజినీర్లు 48 ఖాళీలు ఉన్నాయి. ఇందులో తెలిపిన ఉద్యోగాలకు దరఖాస్తు చేరుకోవడానికి ఈ రోజు ఆఖరి తేదీగా తెలుస్తోంది.

ఈ పోస్ట్ లకు విద్యార్హతలుగా లైన్ మెన్ కోసం అప్లై చేయాలి అనుకుంటే… టెన్త్, ఐటిఐ లలో ఉట్టెర్ణులు అయి ఉండాల్సి ఉంది. అదే విధంగా ఇంజనీర్ పోస్ట్ లకు ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ విభాగాలలో ఇంజనీర్ గా ఉతీర్ణులై ఉండాలి. ఈ ఉద్యోగాల గురించి మరింత సమాచారం కావాల్సి వస్తే www.tssouthernpower.com వెబ్ సైట్ ను సందర్శించండి. ఈ రోజుతో అప్లికేషన్ కు గడువు ముగియనుండగా, హాల్ టికెట్ లను ఏప్రిల్ 24 న మరియు పరీక్షలను ఏప్రిల్ 30 వ తేదీన నిర్వహించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news