ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఖరారు.. 2022-23 ఏడాదికి 8.15శాతం

-

ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌) ఖాతాల్లో నిల్వలపై వడ్డీ రేటు ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15% వడ్డీరేటు ను నిర్ణయిస్తూ.. కేంద్రానికి ఈపీఎఫ్‌ఓ ప్రతిపాదనలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం (8.10శాతం)తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ.

ఇవాళ జరిగిన ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.15శాతం ఇవ్వాలని నిర్ణయించారు.  సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపుతారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ 5 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికశాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

2021-22 మార్చిలో ఈపీఎఫ్​పై వడ్డీ రేటును నాలుగు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి తగ్గించింది సంస్థ. 8.5 శాతంగా ఉన్న వడ్డీ రేటును 2021-22 ఏడాదికి 8.1 శాతానికి తగ్గించింది. గత నాలుగు దశాబ్దాల్లో పీఎఫ్‌పై ఇదే తక్కువ వడ్డీ రేటు కావటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news