సెక్స్ స్కాంలో మాజీ సీఎం, గ‌వ‌ర్న‌ర్‌, మంత్రులు, ఐఏఎస్‌లు… లిస్ట్ ఇదే..

-

హానీ ట్రాప్‌.. ఈ మాట రాజ‌కీయాల్లో చాలా చోట్ల వినిపిస్తూనే ఉంటుంది. ఒక్క‌మాటలో చెప్పాలంటే.. సెక్స్ ర్యాకెట్‌. రాజ‌కీయ నాయకుల‌కు వ‌ల‌విసిరి.. వారి ప‌నులు చేయించుకోవ‌డమే ల‌క్ష్యంగా రాజ‌కీయ నేత‌ల బ‌ల‌హీన‌త‌లను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా, త‌ర్వాత దీనిని బ్లాక్ మెయిల్ చేయ‌డం వంటిదే హానీ ట్రాప్‌. ఇప్పుడు ఈ ఉదంతంలో ఏకంగా రాజ‌కీయ మ‌డి క‌ట్టుకున్నామ‌ని ఘోషిస్తున్న బీజేపీకి చెందిన బిగ్ బాస్‌లే చిక్కుకు పోవ‌డం రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. మ‌ధ్య ప్ర‌దేశ్‌లో ఈ ఏడాది ఆరంభం వ‌ర‌కు కూడా బీజేపీ ప్ర‌భుత్వ పాల‌న సాగించింది. ఈ ఏడాదిలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపీ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ప్ర‌భుత్వం అధికారం కోల్పోయింది.

ప్ర‌స్తుతం ఇక్క‌డ కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాజ్య‌మేలుతోంది. ఇదిలావుంటే, తాజాగా గ‌త ప్ర‌భుత్వంలో చోటు చేసుకున్న ఓ సెక్స్ ర్యాకెట్ గుట్టు వెల్ల‌డైంది. దీనిలో మాజీ సీఎం స‌హా ఉన్న‌తాధికారులు .. ప‌లువురు బీజేపీ నేత‌లు ఉండ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర సంచ‌ల‌నంగా మారిపోయింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన హానీ ట్రాప్‌ కుంభకోణంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ గవర్నర్‌తో సహా పలువురు ప్రముఖులు చిక్కుకుపోయారు. బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులను అభ్యంతకర భంగిమల్లో ఉన్నప్పుడు చిత్రీకరించిన 92 హైక్వాలిటీ వీడియో క్లిప్‌లు పోలీసు అధికారుల చేతికందాయి. అంతేకాక ఈ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఐదుగురు మహిళలను అరెస్ట్‌ చేసి, రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకొన్నారు.

హనీట్రాప్‌నకు సూత్రధారిగా వ్యవహరించిన శ్వేత పోలీసుల‌కు తెలిపిన వివ‌రాల మేర‌కు.. త‌న భ‌ర్త స్వాప్నిల్ జైన్ నిర్వ‌హిస్తున్న ఓ స్వ‌చ్ఛంద సంస్థ కోసం విరాళాలు సేక‌రిస్తున్నారు. ఈ క్ర‌మంలో రాజ‌కీయ నేత‌ల‌ను, ఉన్న‌తాధికారుల‌ను క‌లిసిన‌ప్పుడు.. వారిని హానీట్రాప్‌లోకి లాగారు. శ్వేతా తాను లక్ష్యంగా చేసుకొన్న ఒక బ్యూరోక్రాట్ లేదా మంత్రిని గెస్ట్ హౌస్ లేదా తాను ఎంపిక చేసుకొన్న ఫైవ్ స్టార్ హోటల్‌కు ఆహ్వానించేది. టాప్‌ మోడల్స్, కాల్‌గర్ల్స్‌, బాలీవుడ్ నటీమణులను ఎరవేసేది. ఒకసారి ‘టార్గెట్’ శృంగారంలో పాల్గొంటుండగా చాటుగా వీడియోను చిత్రీకరించేవారు. అనంతరం వాటిని చూపి సదరు వ్యక్తులను బ్లాక్‌మెయిల్‌ చేసేవారు.

మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం తనకు భోపాల్‌లోని ఖరీదైన ప్రాంతమైన మినల్ రెసిడెన్సీలో ఒక బంగ్లా బహుమతిగా ఇచ్చినట్లు శ్వేత‌ అంగీకరించారు. మరో మహిళ ఆర్తీ దయాళ్‌ కూడా ఐఏఎస్ అధికారి నుంచి గిఫ్ట్‌గా భోపాల్‌లో ఒక ఫ్లాట్ పొందానని అంగీకరించా రు. మొత్తానికి రాజ‌కీయ నేత‌ల వీక్‌నెస్‌ను ఈ మ‌హిళ‌లు బాగానే క్యాష్ చేసుకున్నారు. ఇదిలావుంటే, రాజ‌కీయంగా ఈ విష‌యం దుమారం రేపింది. ఈ సెక్స్ రాకెట్‌ను కావాల‌నే కాంగ్రెస్ ప్ర‌భుత్వం వెలుగులోకి తెస్తోంద‌ని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే, ఈ విష‌యంలో త‌మ వారు ఉన్న‌ప్ప‌టికీ వ‌దిలేది లేద‌ని ప్ర‌భుత్వం అంటోంది. ప్ర‌స్తుతం హ‌రియాణా.. సహా ప‌లు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో సెక్స్ రాకెట్ కుంభ‌కోణం వెలుగు చూడ‌డం బీజేపీకి ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news