టీమిండియాకి లక్కీ ప్లేయర్‌గా మారిన హుడా…16 కు 16 మ్యాచ్ లు !

-

తొలుత ఇంగ్లండ్‌, త‌ర్వాత వెస్టిండీస్ టూర్ల‌లో రాణించిన భార‌త క్రికెట్ జ‌ట్టు తాజాగా జింబాబ్వే టూర్‌లోనూ స‌త్తా చాటింది. 3 వ‌న్డేల వ‌న్డే సిరీస్‌ను ఇంకో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే… భార‌త చేజిక్కించుకుంది. జింబాబ్వేలోని హ‌రారే స్పోర్ట్స్ క్లబ్ వేదిక‌గా సాగుతున్న రెండో వ‌న్డేలో జింబాబ్వే నిర్దేశించిన ల‌క్ష్యాన్ని టీమిండియా బ్యాట‌ర్లు కేవ‌లం 25.4 ఓవ‌ర్ల‌లోనే చేధించి విజ‌యం సాధించారు.

అయితే.. ఈ మ్యాచ్‌ లో టీమిండియా యువ ప్లేయర్‌ దీపక్‌ హుడా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో హుడా 25 పరుగులతో రాణించి.. టీమిండియాను గెలిపించాడు. ఈ నేపథ్యంలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.

క్రికెటర్‌ గా ఆరంగేట్రం చేసిన తర్వాత హుడా ఆడిన 16 మ్యాచ్‌ ల్లోనూ టీమిండియా గెలిచింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌ లో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి ఆటగాడిగా హుడా నిలిచాడు. హుడా ఇప్పటి వరకు 9 టీ 20లు, 7 వన్డేల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించగా.. అన్ని మ్యాచ్‌ ల్లోనూ టీమిండియా విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version