ఏపీలో మరోసారి పాత కక్షలు భగ్గుమన్నాయి. గణపతి నిమజ్జనం వచ్చిన రెండు గ్రూపులు ఎదురెదురుగా రావడంతో పాతకక్షలు గుర్తొచ్చాయి. దీంతో రెండు గ్రూపులకు మధ్య తవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. అది కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ముందుగా యువకుల మధ్య మొదలైన గొడవ కాస్త పెరిగి ఇరువర్గాల ఘర్షణగా మారింది. దీంతో కత్తులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.
అనంరతం వెంటనే వారిని గుంటూరు ప్రభుత్వం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఈ భయానక ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి వడ్లవల్లిలో గురువారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇరువర్గాల పరస్పరం ఫిర్యాదులతో రెండు వర్గాలపై కేసులు నమోదు చేశారు.అంతేకాకుండా పరిస్థితులు మరోసారి చేయి దాటకుండా వడ్లవల్లిలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోసారి దాడులు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.