క్షీణించిన ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి.. ఆసుపత్రి లేటెస్ట్ బులెటిన్ ఇదే !

-

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి మళ్ళీ విషమించినట్టు సమాచారం అందుతోంది. గత కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా సోకడంతో చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు కరోన తగ్గినా ఇంకా లంగ్స్ సంబందింత సమస్యలతో బాధ పడుతుండడంతో ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఒకటి రెండు రోజుల్లో రని ప్రచారంఆయన డిశ్చార్జ్ కూడా అవనున్నా జరిగింది. అయితే ఆయన ఆరోగ్యం మళ్ళీ విషమంగా మారిందని అనటున్నారు. ఆయనకు మళ్ళీ అనారోగ్యం తిరగబెట్టినట్టు సమాచారం అందుతోంది. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

 

రోజూ ఆయన హెల్త్ బులిటెన్ ని విడుదల చేసే కుమారుడు ఎస్పీ చరణ్ ఇకా ఆయన బులెటిన్ ని విడుదల చేయలేదు. అయితే ఆసుపత్రి నుండి ఇప్పుడే బులెటిన్ వెలువడింది. ఆయన ఆరోగ్య పరిస్థితి 24 గంటల వ్యవధిలో బాగా క్షీణించినట్టు పేర్కొంది. అయితే ఆయనకి ఇంకా ఎక్మో సపోర్ట్ మీద చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ప్రస్తుతానికి లైఫ్ సపోర్ట్ మీదనే చికిత్స అందిస్తున్నామని, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆసుపత్రి చెబుతోంది. నిజానికి ఈ నెల 19 నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి హెల్త్ బులిటెన్ ని విడుదల చేయలేదు. కుమారుడు చరణే రోజూ అబిమానుల కోసం ఈ సమాచారాన్ని అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news