మీరు మీ ఇంటి అద్దెను క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించినట్లయితే ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఇది కేవలం మీకు అందుబాటులో ఉన్న కొన్ని రకాల యాప్ల సాయంతో క్రెడిట్ కార్డు ద్వారా సులభంగా ఇంటి అద్దె చెల్లించవచ్చు. దీనివల్ల మీరు అదనపు ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు అద్దె ఇళ్లలో ఉండటం సాధారణం. ఉద్యోగులు, వ్యాపారులు ఎవరైనా రెంట్‌ను నగదు రూపంలోనే ఇస్తుంటారు. కానీ, ఇంటి అద్దెను క్రెడిట్ కార్డుతో చెల్లించడం వల్ల లాభాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో క్రెడిట్ కార్డులు సులభంగా చెల్లించవచ్చు. ఈఎంఐల నుంచి ఆన్ లైన్ షాపింగ్ చెల్లింపుల వరకు క్రెడిట్ కార్డుతో ప్రయోజనాలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డు ద్వారా రెంట్ చెల్లించే ధోరణి పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు అద్దె డబ్బును వేరే అవసరాలకు కేటాయించవచ్చు. జీతం ఆలస్యంగా వచ్చినా ఇబ్బందులు పడకుండా ఉండవచ్చు. మొదటి వారంలో చెల్లించాల్సిన హౌస్ రెంట్‌ను క్రెడిట్ కార్డు ద్వారా నెలాఖరు వరకు సర్దుబాటు చేసుకోవచ్చు.
దీనికోసం సృష్టించిన ప్రత్యేక యాప్‌లు ఉన్నాయి. ముందుగా ఈ యాప్‌లో వివరాలు నమోదు చేసి, అకౌంట్ ఓపెన్ చేయాలి. వినియోగదారులు ఇంటి చిరునామా, కార్డు వివరాలు కూడా నమోదు చేయాలి. ఇంటి యజమాని పేరు, బ్యాంకు అకౌంట్ అద్దె వివరాలు, చెల్లించాల్సిన వ్యవధి నమోదు చేయాలి. యాప్ ద్వారా అద్దె చెల్లించేందుకు అద్దెకు సంబంధించిన అగ్రిమెంట్‌ను తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసినందుకు యాప్‌లు కొంత ఫీజు వసూలు చేస్తాయి. మనకు అందుబాటులో ఉన్న రెంట్ పేమెంట్ ప్లాట్‌ఫాంలలో నాలుగు సంస్థలకు మంచి ఆదరణ ఉంది.
నో బ్రోకర్ యాప్ ‘ఫిక్స్‌డ్ ఫీ మోడల్’ ఆధారంగా పనిచేస్తుంది. లబ్ధిదారుల బ్యాంకు వివరాలను యాప్‌లో నమోదు చేసిన తరువాత సేవలను కొనసాగించవచ్చు. అద్దె, మెయింటెనెన్, డిపాజిట్, టోకెన్ ఫీజు అన్ని రకాల ప్రాపర్టీ పేమెంట్‌లనూ ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చు. దీని ద్వారా అద్దె చెల్లించేవారు రూ.500 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అన్ని రకాల పేమెంట్స్‌కు ప్రస్తుతం ఒక శాతం సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తున్నారు. వినియోగదారులు పేమెంట్ పూర్తిచేసిన తరువాత బ్యాంకు ఆధారంగా క్యాష్ బ్యాక్, ఇతర ఆఫర్లు పొందే అవకాశం కూడా ఉంటుంది. redgiraffe rentpayమన దేశంలోని 40 బ్యాంకులతో ఈ సంస్థ ఒప్పందం చేసుకుంది. బ్యాంకుల కస్టమర్లు తమ క్రెడిట్ కార్డుల వివరాలను యాప్‌లో నమోదు చేసుకొని అద్దె చెల్లించవచ్చు. ఈ యాప్ ద్వారా నెలవారీగా అద్దె చెల్లించవచ్చు. అవసరమైతే ఎంచుకున్న కాలవ్యవధికి అద్దె చెల్లించేలా పేమెంట్స్‌ను షెడ్యూల్ చేయవచ్చు. కస్టమర్లు www,redgiraffe rentpay.com ’రెంట్ పే’ విభాగంలో ఉండే వివరాలను పూర్తిగా చదివి, అవసరమైన సమాచారాన్ని పొందవచ్చు. యాప్ సేవల కోసం వినియోగదారుల RG ID వివరాలు తీసుకోవాలి. రెంట్ అగ్రిమెంట్‌ని అప్ లోడ్ చేయాలి. దరఖాస్తు ఫారం సబ్మిట్ చేసిన తరువాత ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా వినియోగదారులు పాస్ వర్డ్ పంపిస్తారు. ఆ తరువాత సేవలను కొనసాగించవచ్చు. ఈ యాప్ ద్వారా సేవలు పొందే కస్టమర్లు 0.39 శాతం ఫీజు, GSTఫీజులను అదనంగా చెల్లించాలి.
housing.com payrent ప్రస్తుతం Housing.com అద్దె చెల్లింపుల సేవలను వీసా, మాస్టర్ కార్డుల కస్టమర్లు మాత్రమే ఉపయోగించే వీలు ఉంది. ఈ ప్లాట్‌ఫాంలో అకౌంట్ ఓపెన్ చేసి ఇంటి యజమాని బ్యాంకు అకౌంట్ వివరాలు, ఇతర సమాచారాన్ని నమోదు చేయాలి. ఈ వెబ్‌సైట్ ద్వారా అద్దె చెల్లించేవారు క్యాష్ బ్యాక్, లాయల్టీ పాయింట్లను పొందవచ్చు. చెల్లించిన మొత్తం ఇంటి యజమాని అకౌంట్లో క్రెడిట్ అయ్యేందుకు 48 గంటల సమయం పడుతుంది.
Credrentpay ద్వారా కేవలం మూడు స్టెప్స్‌లోనే అద్దె చెల్లించవచ్చు. యూజర్ ఫ్రెండ్లీ రెంట్ పేమెంట్ యాప్‌లలో ఇది ముందుంటుంది. యాప్‌లో ఇతర ఫీచర్లు కూడా కస్టమర్లను ఆకట్టుకుంటాయి. క్రెడిట్ కార్డు పేమెంట్ సేవలకు 1.5 శాతం సర్వీస్ ఛార్జీని వసూలు చేస్తారు.Credrentpayతో రూ.2,00,000 వరకు అద్దె చెల్లించవచ్చు. రూ.50,000 మించి ఉండే రెంట్ పేమెంట్స్ కోసం పాన్ కార్డు వివరాలను యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.