మీ జీవితంపై ఈ రంగులు ఎంత ప్రభావం చూపుతాయో తెలుసా..?

-

జీవితమే సప్త వర్ణాల హరివిల్లు అని పోలుస్తారు కవులు. మన జీవితంలో అడుగడుగునా కనిపించే ఈ రంగులు మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం.. ప్రపంచం నిండా ఎన్నో రకాల రంగులున్నాయి. ప్రతీ రంగు మనిషిని ప్రభావితం చేస్తుంది.ముందుగా.. నీలంరంగు.. ఇది ప్రపంచంలోని 40 శాతం మందికి ఇష్టమైన రంగు.. ఇది మనసుని ఆహ్లాదంగా ఉంచుతుంది.

ఎరుపు, పసుపు రంగులు.. రెండూ మనిషిలో ఆకలిని అభివృద్ధి చేస్తాయని శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. అందుకే అనేక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్స్ లోగోలలో ఈ రెండు రంగులలో కనీసం ఒకటైనా ఉండి తీరుతుంది. ఆకుపచ్చ రంగు కంటికి విశ్రాంతి ఇచ్చి ఎలాంటి ఒత్తిడి కలగనీయదు. అందుకే కంప్యూటర్ మానిటర్ కి ఈ రంగు ఉత్తమం.

ఇక తెలుపు రంగు స్పష్టతకి, తాజాదనానికి చిహ్నం. అందుకే తెల్లరంగు వేసిన గది గర్భవతులకి మంచిదని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఇక నలుపు రంగు..చాలా మందికి ఈ రంగంటే అంత సదభిప్రాయం ఉండదు. ఇది బరువైన రంగు. మిగిలిన రంగుల పెట్టె లకన్నా, నల్లరంగు పెట్టెలు బరువుగా ఉన్నాయని ఓ పరిశోధనలో తేలిందట.

ఎరుపు రంగు మనుషులకి ప్రమాద చిహ్నం. కానీ కోళ్ళకి ఆ రంగు శాంతిగా ఉంటుందట. ఎర్ర లైట్ వెలుగులో అవి శాంతిగా ఉండడమేకాక హాయిగా నిద్రపోతాయట. గులాబీరంగు ప్రశాంతతని ప్రేరేపించే రంగు. ఫెంగ్ షుయ్ ప్రకారం ఈ రంగు గదిలో అనేక పాజిటివ్ ఎనర్జీలు పెరుగుతాయట.

వెండి రంగు.. కారుకి అతి భద్రమైన రంగు. ఇతర రంగుల కార్లతో పోలిస్తే వెండి
రంగు కార్లకు అతి తక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక బూడిదరంగులో శక్తి తక్కువ. బద్దకానికి, నిర్లిప్తతకి ఈ రంగు దారి తీస్తుందట. ఇదీ రంగుల కథాకమామీషు. ఇక ఏ రంగులు కావాలో మీరే తేల్చుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news