త్వరలో అందుబాటులోకి ఈ-పాస్‌పోర్టులు… అసలు ఇవి ఎలా పని చేస్తాయంటే..?

-

త్వరలోనే ఈ-పాస్‌పోర్ట్‌ ని తీసుకు రానున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే వీటి కోసం చిప్‌లు, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని ఉపయోగించడం జరుగుతుంది. ఎక్కువ సెక్యూరిటీ తో ఉండాలి కనుక రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్, బయోమెట్రిక్‌లను వాడతారు. వీటిని అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా రూపొందిస్తామన్నారు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

పాస్‌పోర్ట్ జాకెట్‌పై సెక్యూరిటీ సంబంధిత డేటా ఎన్‌కోడ్ చేయబడిన ఎలక్ట్రానిక్ చిప్ అనేది ఉంటుంది. అలానే ప్రపంచవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ పోస్ట్‌ల ద్వారా సాఫీగా వెళ్లేందుకు ఉపయోగపడుతుంది. విమాన ప్రయాణాల సమయంలో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ సులభతరం చేస్తుంది కూడా. ఇలా దీని వలన చాలా లాభాలున్నాయి. అయితే ఇది మహారాష్ట్ర నాసిక్ లోని సెక్యూరిటీ ప్రెస్ లో ఈ-పాస్‌పోర్ట్‌ల తయారీ చేస్తారు.

ఇది చూడడానికి సాధారణ పాస్‌పోర్ట్‌లాగే ఉంటుంది. కానీ ఒక చిన్న చిప్ దీనిలో ఉంటుంది.
ఫేక్ వాటిని ఈజీగా గుర్తించడానికి అవుతుంది. ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో వివరాలను వేగంగా వెరిఫై కూడా అయ్యిపోతాయి.
ప్రయాణాలు చేసేటప్పుడు సమయం చాలా ఆదా అవుతుంది.
చాలా సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి దీనికి.
మాములుగా అయితే పాస్‌ పోర్ట్‌లోని అన్ని వివరాలను అధికారులు చెక్ చెయ్యాలి కనుక టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ ఈ-పాస్‌పోర్ట్‌ వల్ల అలంటి బాధలేమి వుండవు. ఇమ్మిగ్రేషన్ కోసం వేచిచూడాల్సిన సమయం 50శాతం తగ్గిపోనుంది. బయోమెట్రిక్ డీటైల్స్ కూడా ఈ చిప్ లో స్టోర్ అయ్యే ఉంటాయి. ఇలా ఇన్ని లాభాలున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news