మోడీ సర్కార్ ఎంత అప్పు చేస్తుందో తెలుసా…?

-

కరోనా వైరస్ ఇప్పుడు దేశంలో తీవ్రంగా పెరుగుతుంది. దీనితో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ని ప్రకటించింది. అన్ని ఆదాయ మార్గాలు కూడా ఇప్పుడు దాదాపుగా ఆగిపోయే పరిస్థితి నెలకొంది మన దేశంలో. ఇప్పట్లో లాక్ డౌన్ ని ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవడం కూడా భ్రమ అనేది కొందరి మాట. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి భారీగా ఖర్చు అవుతుంది కూడా.

ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారీగా అప్పు చెయ్యాలని భావిస్తుంది. ఏప్రిల్‌ 1తో ఆరంభం కానున్న 2020-21 తొలి త్రైమాసికంలో రూ.4.88 లక్షల కోట్లను అప్పుగా తీసుకుని ఆర్ధిక విపత్తును ఎదుర్కొనేందుకు అప్పు తీసుకోవడానికి రెడీ అవుతుంది. ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అతాను చక్రవర్తి మీడియాకు వివరించారు. , కొత్త ఆర్థిక సంవత్సరంలో స్థూల రుణాలు రూ.7.8 లక్షల కోట్లుగా ఉంటాయని,

బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఏడాది ఇది రూ.7.1 లక్షల కోట్లుగా ఉంది. నికర రుణాలు 2020-21 ఆర్థిక సంవత్సారానికి రూ.5.36 లక్షల కోట్లుగా ఉంటాయని ఆమె బడ్జెట్ సందర్భంగా చెప్పారు. 2019-20లో ఇది రూ.4.99 లక్షల కోట్లు ఉంది. ఇప్పుడు కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించడమే కాక ప్రజలకు కూడా ఆర్ధికంగా అండగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news