ఏపీలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ తరుణంలోనే జలపాతం ఉగ్రరూపం దాల్చింది. అల్లూరి జిల్లాలోని కొత్తపల్లి జలపాతం ఎలా ఉగ్రరూపం దాల్చింది. వాయుగుండం ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో ఈ జలపాతానికి వరద పోటెత్తింది. దీంతో పర్యాటకులు సందర్శనకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాతే అనుమతిస్తామని తెలిపారు.
ఏపీలో… ఉత్తర ప్రాంతంలో ఉన్న జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. విశాఖపట్నం విజయనగరం, శ్రీకాకుళం అల్లూరి, తూర్పుగోదావరి, రాజమండ్రి లాంటి ప్రాంతాలలో.. మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే ఈ ప్రాంతాలలో ఇవాళ విద్యా సంస్థలకు హాలిడే కూడా ప్రకటించడం జరిగింది.