ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి

-

ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటీనటులు అలాగే నిర్మాతలు… వివిధ కారణాల వల్ల మరణించారు. కరోనా సమయం నుంచి ఇప్పటివరకు చాలామంది ప్రముఖ నటులను ఇండస్ట్రీ కోల్పోయింది. అయితే తాజాగా తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత ఢిల్లీ బాబు మరణించారు.

Shocking News Dilli Babu Producer Of Bachelor And Ratchasan Movie Passed Away Due To Illness

50 సంవత్సరాలు ఉన్న ఢిల్లీ బాబు.. తీవ్ర అనారోగ్యంతో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన చెన్నైలోని.. ఓ ప్రముఖ ఆస్పత్రిలో అనారోగ్యంతో మరణించినట్లు సమాచారం. రాక్షసుడు ఓ మై గాడ్ బ్యాచిలర్ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు… ఢిల్లీ బాబు నిర్మాతగా వ్యవహరించారట. యాక్సెస్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్లో ఆయన నిర్మించిన మిర్యాల మరకతమని సినిమాలు తెలుగులో కూడా విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే 50 సంవత్సరాల లోపే ఢిల్లీ బాబు మరణించడంతో ఆయన మృతి పై తమిళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version