మనం అనేక వంటల్లో నేయ్యిని ఉపయోగిస్తూ ఉంటాం. ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మంచిది. స్వీట్స్ నుండి అనేక వంటల్లో దీనిని ఉపయోగిస్తూనే ఉంటాం. కమ్మటి నెయ్యి భోజనం లో వేసుకుని తింటే ఆ రుచే వేరు. కొందరు అయితే బయట కొనకుండా ఇళ్లల్లోనే నెయ్యిని చేసుకుంటారు. కొన్ని సార్లు బయట కొన్న నెయ్యి నిజమైనదా…? లేదా కల్తీదా…? అనే అనుమానం మనకి కలగవచ్చు. అయితే ఎలా తెలుసుకోవాలి…? ఈ విషయానికి వస్తే… ఈ చిన్న చిన్న పద్ధతుల్లో తెలుసుకోవచ్చు చూసేయండి.
కల్తీ నెయ్యిని పసిగట్టేందుకు ఒక స్పూన్ నెయ్యి లో కొంచెం చక్కెర వేయండి. హైడ్రాక్లోరిక్ ఆమ్లాన్ని కొద్దిగా కలపండి. అది ఎరుపు రంగు లోకి మారితే కల్తీ చేశారని గ్రహించాలి. నెయ్యి నాణ్యతను పరీక్షించడానికి నేతిలో 4 లేదా 5 చుక్కలు అయొడిన్ వేయండి. అది కనుక నీలి రంగు లోకి మారిందంటే అది నకిలీదని అర్ధం. అంటే నెయ్యి లో ఆలుగడ్డ వంటి పిండి పదార్థాలు కలపడం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు ఈ రంగు వస్తుంది.
అంతే కాదండి మరో సింపుల్ టెక్నీక్ ద్వారా కూడా మనం చెప్పొచ్చు. చేతి లో కాస్త నెయ్యి వేసి.. రెండు చేతిల తో బాగా రుద్దాలి. కాసేపయ్యాక నెయ్యి వాసన రాలేదా అది కల్తీది అని అర్ధం. అదే వాసన అలానే ఉంది అంటే అది స్వచ్ఛమైనది అని. నాణ్యమైన నెయ్యి తెల్లగా గడ్డకట్టినట్లుగా ఉంటుంది. పూసపూసలా కనిపిస్తుంది. కల్తీ చేస్తే అలా ఉండదు. నెయ్యి లో కొందరు రసాయనాలు కలుపుతున్నారు. ఇది ఆరోగ్యానికి హానికరం. కాబట్టి గ్రహించి ఉపయోగిస్తే ఆరోగ్యానికి హాని జరగదు.