నన్ను ధోనీతో పోలుస్తారా…? నాకు అసలు ఇష్టం లేదు

-

ఆస్ట్రేలియాలో ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ కు మంచి విజయం అందించిన భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్… హీరో అయ్యాడు. అక్కడి నుంచి కూడా పంత్ పై వరుస ప్రసంశలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఎంఎస్ ధోనితో అతన్ని పోల్చడం చాలా మందిని షాక్ కి గురి చేసింది. దీనిపై స్పందించిన పంత్… ఒక లెజెండ్‌ ను యువ క్రికెటర్‌తో పోల్చడం అన్యాయమని చెప్పాడు.

rishab panth

గురువారం ఆస్ట్రేలియా పర్యటన విజయవంతంగా ముగిసిన తర్వాత న్యూ ఢిల్లీ వచ్చిన పంత్ విలేకరులతో మాట్లాడాడు. మీరు ఎంఎస్ ధోని లాంటి వ్యక్తితో నన్ను పోల్చినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నాడు. అతనితో పోల్చడం నాకు చాలా బాగుంది. కాని నన్ను ఎవరితోనూ పోల్చడం నాకు ఇష్టం లేదు అన్నాడు. భారత క్రికెట్‌లో నాకంటూ ఒక పేరు సంపాదించాలనుకుంటున్నాను అని పంత్ అన్నాడు.

దాని మీదనే నేను దృష్టి కేంద్రీకరించాను అని పేర్కొన్నాడు. బ్రిస్బేన్లో పంత్ ఆడిన ఇన్నింగ్స్ టీం ఇండియాకు మంచి విజయాన్ని అందించింది. చేతి గాయం నుండి కోలుకున్న తరువాత, 5 వ రోజు అజేయంగా 89 పరుగులు చేశాడు. గబ్బాలో భారత్ రికార్డు స్థాయిలో 328 పరుగులు చేసింది. పంత్ దెబ్బకు ఆస్ట్రేలియా ఆటగాళ్ళు చుక్కలు చూసారు. అతను అలా ఆడిన తర్వాత ఎంఎస్ ధోని, ఆడమ్ గిల్‌క్రిస్ట్ మరియు మార్క్ బౌచర్ వంటి వారితో పోల్చారు.

Read more RELATED
Recommended to you

Latest news