లింక్ ను ఓపెన్ చేసిన తర్వాత మీ జిల్లా పేరును డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ అసెంబ్లీ నియోజకవర్గం పేరును సెలెక్ట్ చేసుకోండి. ఇంటినెంబర్ కరెక్ట్ గా డ్యాష్ లతో సహా టైప్ చేయండి. ఆ తర్వాత పేరు అని ఉన్న ఆప్షన్ లో మీ పేరు మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పేరులోని మొదటి మూడు అక్షరాలు టైప్ చేస్తే సరిపోతుంది.
ప్రస్తుతం ఏపీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అందరికీ తెలుసు. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించి తమ స్వార్థం కోసం టీడీపీ ఉపయోగించుకొని.. తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఏపీ ప్రజల్లో కొంత అనిశ్చితి నెలకొన్నది. అసలు.. తమ ఓటు ఉందా లేదా? తమ ఓటు కూడా తొలగించారా? అసలు.. తమకు ఓటు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి.. అనే డైలమాలో పడ్డారు.
అందుకే.. అటువంటి సందేహం ఉన్నవాళ్లు ఆన్ లైన్ లో ఓటరు లిస్ట్ లో తమ పేరు ఉందో లేదో ఈజీగా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి కొంత సమాచారం ఇవ్వాలి.
చెక్ చేసుకోవడం ఎలా?
మీ జిల్లా పేరును డ్రాప్ డౌన్ లిస్ట్ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ అసెంబ్లీ నియోజకవర్గం పేరును సెలెక్ట్ చేసుకోండి. ఇంటినెంబర్ కరెక్ట్ గా డ్యాష్ లతో సహా టైప్ చేయండి. ఆ తర్వాత పేరు అని ఉన్న ఆప్షన్ లో మీ పేరు మొత్తం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ పేరులోని మొదటి మూడు అక్షరాలు టైప్ చేస్తే సరిపోతుంది. ఇంటిపేరు కాకుండా మీ పేరులోని మొదటి మూడు ఇంగ్లీష్ అక్షరాలను టైప్ చేయండి. తర్వాత మీ ఓటర్ ఐడీ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయండి. ఓటర్ ఐడీ మీద దాని నెంబర్ ఉంటుంది. అది ఉన్నది ఉన్నట్టుగా ఎంటర్ చేయాలి. తర్వాత మీ జెండర్ ను సెలెక్ట్ చేసుకొని.. క్యాప్చాను ఎంటర్ చేయండి. తర్వాత పక్కనే ఉన్న సెర్చ్ బటన్ ను నొక్కండి. ఒకవేళ ఆ పేరు మీద ఓటర్ లిస్టులో పేరు ఉంటే వెంటనే మీకు మీ పేరు కనిపిస్తుంది. మీ పేరు లేకపోతే.. నాట్ ఫౌండ్ అని చెబుతుంది.
ఉదాహరణకు… జిల్లా పేరు.. శ్రీకాకుళం, అసెంబ్లీ నియోజకవర్గం పేరు.. పాలకొండ.. ఇంటి నెంబరు.. 4-35/3, పేరు… Tandu Ramalingaiah అయితే… ఇంటిపేరుతో కాకుండా.. పేరు లోని మూడు అక్షరాలు Ram మాత్రమే ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఓటర్ ఐడీ నెంబరు… XDEO003345IGJ, తర్వాత జెండర్.. మేల్ సెలెక్ట్ చేసుకొని.. క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే చాలు. ఆ పేరు మీద ఓటు ఉంటే కింద చూపిస్తుంది. లేకపోతే చూపించదు.
మీ జిల్లా పేరు, అసెంబ్లీ నియోజకవర్గం పేరు, మీ ఇంటి నెంబర్, మీ పేరు, ఓటర్ ఐటీ కార్డు నెంబర్ వివరాలన్నీ దగ్గర పెట్టుకొని
ఇక్కడ
క్లిక్ చేయండి. దానికి సంబంధించిన వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.
ఒకవేళ మీకు ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి పేరు సెర్చ్ చేయడం రాకపోతే.. ఎవరైనా కంప్యూటర్ గురించి కాసింత పరిజ్ఞానం ఉన్నవాళ్లకు చెప్పినా వాళ్లు చెక్ చేస్తారు.