కొంతమంది ముఖ్యమైన పనులని కూడా వాయిదా వేస్తూ ఉంటారు దాని వలన తర్వాత సమయం లేక బాధపడుతూ ఉంటారు. నిజానికి వాయిదా వేయడం మంచిది కాదు ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలి. డెడ్లైన్ దాటక ముందే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని పనులను పూర్తి చేసుకుంటే టైం కి పనులు అయిపోతాయి. ఎలాంటి భయం ఉండదు. అయితే స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉండడం వలన వాయిదా వేసే అలవాటు ఉండదు. ఆ టైం కి నేను ఇలా రీచ్ అవ్వాలి నేను ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి అని క్లియర్ గా ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా వారి పనులని వాయిదా వేసుకోరు.
కొంతమంది ఎక్కువ పనుల వలన ఏ పని చేయాలో అర్థం కాక మర్చిపోతూ ఉంటారు అలా పనులు పూర్తవు అలాంటివారు టైం టేబుల్ ప్రిపేర్ చేసుకుని టైం టు టైం పనులను పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా డెడ్లైన్ కి ముందే పనులు పూర్తవుతాయి. పనులు వాయిదా వేయరు. రోజులో మనం ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది అయితే ఏ పని ఎలా చేసుకోవాలి అని మీరే కేటాయించుకోవాలి. పనికి కాస్త సమయాన్ని కేటాయించుకుంటే పని వాయిదా వేయకుండా ఉండగలరు. పనులు టైం కి పూర్తయిపోతాయి.
అలానే తక్కువ సమయంలో పూర్తయిపోయే పనులని వెంటనే చేసుకోండి అప్పుడు మీరు ప్రశాంతంగా ఫ్రీగా ఉండొచ్చు. ఎక్కువ పనులతో కూరుకుపోకుండా ఉంటారు. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే ఫోన్ కి దూరంగా ఉండాలి. ఈరోజుల్లో ఫోన్ కి అలవాటు పడిపోయి చాలా మంది సమయాన్ని మర్చిపోయి పనులను వాయిదా వేస్తున్నారు తర్వాత డెడ్లైన్ దగ్గర పడి ఇబ్బంది పడుతున్నారు. సమయాన్ని తెలివిగా వినియోగించుకుంటే పనులను వాయిదా వేసుకోరు సమయం విలువ తెలుసుకుంటే కచ్చితంగా పనులను వాయిదా వేయరు. అలానే పని పూర్తయిందా లేదా అని మళ్ళీ చెక్ చేసుకోవాలి పని అయిపోయిందని ధీమాగా కూర్చుంటే కుదరదు.