కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది – ద్రౌపది ముర్ము

-

కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కాసేపటి క్రితమే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ లో పాల్గొన్నారు ద్రౌపది ముర్ము. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ, ధైర్యవంతులు అయిన క్యాడెట్లను కన్న తల్లిదండ్రులకు నా శుభాకాంక్షలు అని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల సేవలు గుర్తుంచుకోవాలని కోరారు.

అధికారులుగా మీరు బాధ్యతలు తీసుకోబోతున్నారని…. రాబోయే రోజుల్లో విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్ళను ధీటుగా ఎదుర్కోవాలని చెప్పారు. సిరియా, టర్కీ లో జరిగిన భూకంపం లో కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాగా పనిచేసిందని.. కోవిడ్ లోనూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా అద్భుతంగా పనిచేసిందని వెల్లడించారు. సవాళ్ళను ఎదుర్కొనేందుకు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని… ఏప్రిల్ లో సుఖాయ్ జెట్ లో ప్రయాణించాను. ఇది నాకు చాలా గొప్ప అనుభూతి అన్నారు. సుమారు 30 నిమిషాలు పాటు సుఖోయ్‌లో ప్రయాణించడం గర్వంగా ఉందని.. ఫైటర్ జెట్ ఫైలెట్లులో మహిళలు సైతం అధికంగా ఉండటం సంతోషదాయకం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news