ఏడ్చే పిల్లలని ఎలా కంట్రోల్ చెయ్యాలి..? ఇలా సులభంగా ఆపించవచ్చు..!

-

కొంతమంది పిల్లలు బాగా ఎక్కువ పేచీ పెడుతూ ఉంటారు ఎంతగానో అల్లరి చేస్తూ వుంటారు. ప్రతీ చిన్నదానికి కూడా ఏడుస్తూ ఉంటారు మీ పిల్లలు కూడా అలానే పేచీ పెడుతూ ఉంటారా ఆ ఏడుపు ని ఆపడం మీ వల్ల అవ్వడం లేదా కచ్చితంగా మీరు ఈ విషయాలని చూడాల్సిందే ఇలా కనుక చేశారంటే పిల్లలు ఏడవడం మానేస్తారు చక్కగా మీరు మీ పిల్లల్ని కంట్రోల్ చెయ్యొచ్చు.

crying babies

పిల్లలు ఎక్కువగా ఏడుస్తున్నట్లు అయితే ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోండి చిన్నపిల్లలు చీటికీ మాటకి ఏడుస్తూ ఉంటారు అయితే వాళ్ల బాధ ఏంటనేది మనకి తెలీదు మామూలుగా మాటలు వస్తే పిల్లలు వారి యొక్క బాధని చెప్తూ ఉంటారు కానీ ఈ మాటలు రాని వాళ్ళు వారి యొక్క బాధని వ్యక్తపరచలేరు. ఊరుకో పెట్టినా కూడా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు.

పిల్లలు ఏడిస్తే ముందు వాళ్ళు ఫిజికల్ గా కంఫర్ట్ గా ఉన్నార లేదా అనేది చూడండి కంఫర్ట్ గా లేకపోతే పిల్లలు ఏడుస్తారు. గాలి సరిగ్గా ఆడుతోందా బట్టలు వలనా ఇలాంటివి చూసి సరి చేయండి ఆ తర్వాత కూడా ఏడుస్తున్నట్లయితే వారికి ఒంట్లో బాగోలేదు ఏమో చూడండి జ్వరం జలుబు లేదంటే ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఎక్కువగా పిల్లల్లో కడుపునొప్పి వస్తుంది చుట్టూ పరిసరాలను కూడా చూస్తూ ఉండండి పెద్ద పెద్ద శబ్దాలు డిస్టబెన్స్ ఇలాంటివి కలిగితే కూడా పిల్లలు బాగా ఏడుస్తారు. ఇది కూడా మీరు చూడండి.

పిల్లలు ఎప్పుడైనా ఏడుస్తున్నప్పుడు మీరు వారితో మాట్లాడడానికి ట్రై చేయండి ఏడుపుని ఆపడానికి చూడండి. పాటలు ఏమైనా పాటడం లేదంటే ఏదో ఒక విషయాన్ని చెప్తూ ఉండడం వంటివి చేస్తే పిల్లలు ఏడుపాపుతారు. పిల్లలు ఏడుస్తున్నప్పుడు ఒకసారి ఇంట్లో లైట్లని కూడా మీరు చూడండి లైట్ ఉంటే పిల్లలు ఏడుస్తారు లైట్ ఆఫ్ చేస్తే ఏడుపు ఆపి ప్రశాంతంగా నిద్రపోతారు. పిల్లలు ఏడుపు ఆపకపోయినట్లయితే ఎత్తుకోవడం తేలిగ్గా ఊపడం వంటివి చేయండి గుక్క పెట్టి ఏడుస్తున్నప్పుడు వారికి ఏదైనా కొత్త వస్తువుని ఇవ్వండి నిద్ర వల్ల కూడా పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఇలా వీటిని చూసుకుని పిల్లల్ని ఏడుపు ఆపించండి.

Read more RELATED
Recommended to you

Latest news