ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతుంది. అయితే నిరుద్యోగులకు, పేద ప్రజలకు ఆర్థిక సాయాన్ని అందించడానికి ఎంతో కృషి చేస్తుంది. కానీ సరైన అవగాహన లేకపోవడంతో చాలా శాతం మంది వాటిని పొందడంలేదు. ముఖ్యంగా మన దేశంలో నిరుద్యోగ యువత పెరిగిపోతోంది. దానిని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పిన కార్యక్రమం పీఎంఈజీపీ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ పధకం ద్వారా 50 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. పైగా దానిలో రాయితీ కూడా అందుబాటులో ఉంది.
అర్హత వివరాలు:
అయితే ఈ పథకాన్ని పొందాలంటే 18 ఏళ్ల వయసు నిండి ఉండాలి మరియు కనీసం ఎనిమిదవ తరగతి చదువుకొని ఉండాలి. పైగా ఒక కుటుంబం నుండి ఒకరు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. ఈ లోన్ పొందిన తరువాత దాని పై వడ్డీ 7 నుండి 10 శాతం వరకు ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి:
- దీనిని దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు www.kviconline.gov.in వెబ్సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం పై క్లిక్ చేయాలి.
- ఇలా చేసిన తర్వాత గ్రామీణ ప్రాంతం కు సంబంధించిన నిరుద్యోగులు అయితే కెవిఐసి ను ఎంపిక చేయాలి. అదే పట్టణ ప్రాంత నిరుద్యోగులు అయితే డిఐసి లో నమోదు చేయాలి.
- ఈ దరఖాస్తును ప్రింట్ చేసి https://www.kviconline.gov.in/pmegpeportal/jsp/pmegponline.jsp వెబ్సైట్ లోకి వెళ్లి ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ఫారం నింపాలి.
- ఈ విధంగా రిజిస్టర్ చేసుకున్న తరువాత యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని ఆన్లైన్ లో దరఖాస్తుకు సంబంధించి అడిగిన వివరాలను ఇవ్వాలి.
- మీ దరఖాస్తు పూర్తి చేసిన 10 నుండి 15 రోజుల్లో మీకు స్పందన వస్తుంది. దీని తరువాత మీరు చేసేటువంటి ప్రాజెక్టు గురించి నెల రోజులు పాటు శిక్షణను అందిస్తారు.
- అయితే ఈ శిక్షణ ఆన్లైన్ లేక ఆఫ్లైన్ లో తీసుకోవచ్చు. శిక్షణ పూర్తి అయిన తర్వాత మొదటి ఇన్స్టాల్మెంట్ లోన్ ఇస్తారు.
- ఈ లోన్ తీసుకుని వరుసగా మూడేళ్లు పాటు వాయిదాలు చెల్లిస్తూ ఉంటే కేంద్రం నుండి సబ్సిడీని కూడా పొందవచ్చు.