చిరిగిన నోట్లను మార్చుకోండిలా…!

-

2000 రూపాయల నోటు మీద దగ్గర ఉంది. అది కొంచెం చినిగిందనుకోండి. దాన్ని మీరు మార్చుకోవాలంటే..

బాబు.. కిలో కందిపప్పు ఇవ్వవా? సార్.. ఇదిగోండి కందిపప్పు. ఓకే.. ఇదిగో 2000 నోటు. చిల్లర ఇవ్వు. సార్.. ఇది చిరిగింది సార్.. వేరే ఇవ్వండి. చిరిగిందా.. బాగానే ఉందే. వేరే నోటు లేదు నాదగ్గర. ఇదే ఉంది. తీసుకో. కుదరదు సార్. అది చిరిగింది. అసలే 2000 రూపాయల నోటు. దాన్ని ఎవరూ తీసుకోకపోతే నా పరిస్థితి ఏంది సార్. మరి.. ఇప్పుడు నా పరిస్థితి ఏంది. ఎవరిచ్చారో ఏమో ఆనోటు. ఇప్పుడు దాన్ని ఎక్కడ మార్చాలి. ఇది సగటు వ్యక్తికి ఏదైనా షాపుకు వెళ్లినప్పుడు ఎదురయ్యే అనుభవమే. మరి.. ఆ వ్యక్తి ఇప్పుడు ఆ చిరిగిన 2000 నోటును ఎలా మార్చుకోవాలి. ఎక్కడ మార్చాలి అసలు. ఇలా చిరిగిన నోట్లను మార్చే వ్యవస్థ అంటూ ఉందా? మార్చినా ఎంతిస్తారు. మొత్తం డబ్బులు వస్తాయా? ఏవైనా కటింగ్స్ పోతాయా? ఇలా సగటు పౌరుడికి వచ్చే డౌట్లే ఇవన్నీ. వీటన్నింటికీ సమాధానమే ఈ వార్త.

ఇదివరకు నోట్ల రద్దుకు ముందు పాత 5, 10, 20, 50, 100, 500, 1000 విలువ గల కరెన్సీ నోట్లను మార్చుకోవడానికి మార్గదర్శకాలు ఉండేవి. నోట్ల రద్దు తర్వాత కొత్తగా వచ్చిన 10, 50, 100, 500, 2000 నోట్లను మార్చుకోవడానికి కొత్తగా ఆర్బీఐ మార్గదర్శకాలను రూపొందించింది. అయితే.. నలిగిపోయిన, చినిగిపోయిన, కాలిపోయిన, తడిచిపోయినా.. ఇలా రకరకాలుగా ఉండే నోట్లను ఎలా మార్చుకోవచ్చో తన మార్గదర్శకాల్లో వివరించింది ఆర్బీఐ. కింద ఇచ్చిన టేబుల్స్ ఒకసారి చూడండి.

అర్థమయ్యాయా? ఇప్పుడు 2000 రూపాయల నోటు మీద దగ్గర ఉంది. అది కొంచెం చినిగిందనుకోండి. దాన్ని మీరు మార్చుకోవాలంటే.. దాని కనీస కొలత 88 చదరపు సెంటీమీటర్లు ఉండాలి. అలా ఉంటే మీకు నోటు మొత్తం డబ్బులు చెల్లిస్తారు. కనీసం సగం డబ్బు రావాలంటే 44 చదరపు సెంటీమీటర్లు ఉండాలన్నమాట. కొత్తగా వచ్చిన 2000 నోటు 109.56 సెంటీమీటర్ల సైజుతో ఉంటుంది. అలా.. ప్రతినోటుకు మార్గదర్శకాలు రూపొందించింది ఆర్బీఐ.


ఎక్కడ మార్చుకోవాలి

చిరిగిన లేదా నలిగిన నోట్లను మార్చుకునేందు ఆర్బీఐ అన్ని బ్యాంకుల బ్రాంచీలలో ఈ సదుపాయం కల్పిస్తోంది. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నోట్ రిఫండ్ నిబంధనలు 2009 ప్రకారం భారతదేశ పౌరులందరికీ అందుబాటులో ఉన్న ప్రతి బ్యాంకు నోట్లను మార్చుకునే అవకాశం కల్పిస్తుంది.

ఇక.. చిరిగిన లేదా నలిగిన నోట్లలో రూ. 5000 లోపు అయితే బ్యాంకులు వాటిపై ఎటువంటి చార్జీలు వసూలు చేయవు.. ఉచితంగానే కొత్త నోట్లు ఇవ్వడం లేదా డిపాజిట్ చేయడం చేస్తాయి. పెద్ద మొత్తంలో అయితే మాత్రం కొంచెం చార్జీని వసూలు చేస్తాయి. మొత్తం చిరిగిన నోట్ల సంఖ్య 20 లేదా రూ. 5000 కంటే ఎక్కువ ఉంటే వాటికి స్లిప్ ఇచ్చి తర్వాత ఆ డబ్బును ఖాతాలో జమ చేస్తారు. ఇక నోటుపై ఏవైనా పిచ్చిరాతలు, గీతలు గీస్తే నోట్ రిఫండ్ 2009 నిబంధన ప్రకారం 6(3)(iii) ప్రకారం ఆనోట్ చెల్లదు. నోటు ప్రధాన ఫీచర్ ఉండే ప్రాంతంలో ఏదైనా రాస్తేనే చెల్లదు.

Read more RELATED
Recommended to you

Latest news