వాట్సప్‌ ఛానల్‌ అప్‌డేట్‌ను ఎలా ఫార్వాడ్‌ చేయడం..? ఒకేసారి ఎంత మందికి పంపవచ్చు..?

-

2023 ఏడాది జూన్‌లో వాట్సాప్ ఛానల్‌ల ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌తో మాదిరిగానే ఈ ఛానల్ ఫీచర్‌ను మొదట ఎంచుకున్న ప్రాంతాలలో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు, మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ ఈ కొత్త ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందరి యూజర్లకు అందిస్తోంది. ఈ క్రమంలోనే వాట్సాప్ ఛానల్ ఫీచర‌ను భారత్‌కు విస్తరించింది. వాట్సాప్ పర్యావరణ వ్యవస్థలోని యూజర్లు, సంస్థల నుంచి ముఖ్యమైన అప్‌డేట్‌లను స్వీకరించడానికి ఛానల్స్ సూటిగా, సురక్షితమైన మార్గాలను అందిస్తున్నాయని వాట్సాప్ పేర్కొంది.

వాట్సాప్ ఛానల్‌లు వన్-వే బ్రాడ్‌క్యాస్ట్ టూల్ పనిచేస్తాయి. వాట్సాప్ అడ్మిన్స్ టెక్స్ట్ మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, స్టిక్కర్లు, పోల్‌లను పంపడానికి వీలు కల్పిస్తాయి. మెటా-యాజమాన్య ప్లాట్‌ఫారమ్ ఛానల్ క్రియేటర్లకు వారి వాట్సాప్ ఛానల్ గురించి సమాచారాన్ని ఎడిట్ చేయడానికి, పర్సనలైజడ్ సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. అయితే మనకు వీటిని ఎలా వాడాలో తెలిసి ఉంటడం చాలా ముఖ్యం. అప్‌డేట్స్‌ను అర్థంచేసుకుని అప్‌డేట్‌గా ఉండాలి. ముందు ఉన్నట్లే ఉంటా అంటే మనకు కొత్త విషయాలు ఏం తెలియవు.

వాట్సాప్ ఛానల్ అప్‌డేట్స్ ఫార్వార్డ్ చేయడం ఎలా..?

వాట్సాప్ యూజర్లు ఛానల్ అప్‌డేట్‌లను స్నేహితులు, కుటుంబ సభ్యులతో సులభంగా షేర్ చేసుకోవచ్చు. ఫార్వార్డ్ చేసిన అప్‌డేట్‌లు ‘Forwarded’ లేబుల్, ఛానల్‌కి లింక్‌ను కలిగి ఉంటాయి. ఆ మెసేజ్ వేరే చోట నుంచి వచ్చిందని, రాసినది కాదని చాట్‌లోని యూజర్లకు స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఇంకా ఛానల్‌లు లేని వారికి ఛానెల్ అప్‌డేట్‌ను ఫార్వార్డ్ చేస్తే.. వారు ఇప్పటికీ చాట్‌లోని అప్‌డేట్‌లోని కంటెంట్‌ను చూడవచ్చు. కానీ, వారు ఛానల్‌ని నేరుగా వీక్షించలేరు.

మీరు ఛానల్ అప్‌డేట్‌ను ఫార్వార్డ్ చేసినప్పుడు.. మీరు దానిని ఒకేసారి 5 చాట్‌లతో షేర్ చేయవచ్చు. ఒక అప్‌డేట్ ఇప్పటికే చాట్‌లోకి ఫార్వార్డ్ చేయబడి ఉంటే.. మీరు గరిష్టంగా ఒక గ్రూప్ చాట్‌తో సహా మరో 5 చాట్‌లకు ఫార్వార్డ్ చేయవచ్చు. ఒక అప్‌డేట్ ఇప్పటికే చాలాసార్లు ఫార్వార్డ్ అయితే.. అది ఒక సమయంలో ఒక చాట్‌కు మాత్రమే ఫార్వార్డ్ అవుతుందని గమనించాలి.

వాట్సాప్ ఛానల్ అప్‌డేట్‌లను ఫార్వార్డ్ చేయండిలా :

1. వాట్సాప్ ఓపెన్ చేసి ఛానల్‌ సెక్షన్‌కు వెళ్లండి.
2. వాట్సాప్ ఛానల్ నుంచి ఫార్వార్డ్ చేయాలనుకుంటున్న అప్‌డేట్‌పై కర్సర్ ఉంచండి, ఆపై > ఫార్వార్డ్ క్లిక్ చేయండి.
3. మీరు ఒకేసారి మల్టీ అప్‌డేట్‌లను ఫార్వార్డ్ చేయాలనుకుంటే పక్కన ఉన్న బాక్స్ ఎంచుకోండి.
4. అప్‌డేట్‌ను ఫార్వార్డ్ చేయడానికి ఫార్వర్డ్ యారో ఐకాన్‌పై క్లిక్ చేయండి.
5. మీరు అప్‌డేట్‌ను ఫార్వార్డ్ చేయాలనుకుంటున్న వ్యక్తిగత లేదా గ్రూపు చాట్‌ల కోసం సెర్చ్ లేదా ఎంచుకోండి.
6. ఇప్పుడు అప్‌డేట్‌ను షేర్ చేసేందుకు Send బటన్‌పై Click చేయండి. అంతే వాట్సప్‌ ఛానల్‌ అప్‌డేట్‌ను ఈజీగా ఫార్వాడ్‌ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news