హెల్ది అయిన ‘బాదం హల్వా’ ఎలా చేసుకోవాలి అంటే ..!

-

సాధారణంగా స్వీట్ అనగానే అందరికి ఎంతో ఇష్టం. అందులోను హల్వా లాంటి స్వీట్ అయితే పిల్లల తో పాటు పెద్దలు కూడా లాగించేస్తారు. ఇందులో బాదం హల్వా అయితే తగినన్ని పోషక విలువలు కూడా మనకు సమృద్దిగా లభిస్తాయి.  పిల్లలకు వారానికి ఒకసారి ఈ బాదం హల్వా పెడితే ఎంతో ఆరోగ్యం గా ఉంటారు.

బాదం హల్వా తయారికి కావలసిన పదార్థాలు: బాదం1 కప్పు, పంచదార ½ కప్పు, నీళ్ళు5 ½ కప్పులు, నెయ్యి ½ కప్పు, కుంకుమ పువ్వు_ 7.బాదం పప్పుని రాత్రంతా నాన పెట్టాలి.

తయారి విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నాలుగు కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి. నీళ్ళు మరిగాక బాదం పప్పు  పది నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన బాదం పైన పొట్టు వలిచి ఒక కప్పు నీటిని పోసి మెత్తని పేస్ట్ లాగా మిక్సి చేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్ పై పెట్టి ఒక కప్పు నీరు పోసి అందులో పంచదార వేసి కరిగించుకోవాలి. ఇందులో కుంకుం పువ్వు కుడా వేసి బాగా కలుపుకోవాలి.దీన్ని సన్నని సెగ మీద ఉడికించుకోవాలి. పక్కన వేరే పాన్లో నెయ్యి వేసి అది వేడయ్యాక బాదం పేస్ట్ వేసి పది నిమిషాలు ఉడికించి అందులో పంచదార పాకం వేసి మరో రెండు నిమిషాలు ఉడికించి నెయ్యి అంత పైన తేలేవరకు ఉడికించాలి. ఇది చల్లరాక బౌల్ లో సర్వ్ చేసుకోవాలి.అంతే బాదం హల్వా రెడీ…!

బాదం హల్వా లోని పోషక విలువలు: వన్ టేబుల్ స్పూన్ కి కేలరీస్132, ఫ్యాట్ 8 g, ప్రోటీన్3g, కార్బో హైడ్రేట్స్ 15g, షుగర్_14g, పైబర్_1g ఇవండీ హల్వాలోని పోషకాలు. పిల్లలకు ఎంతో బలవర్ధక ఆహారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version