టేస్టీ ఎగ్ లెస్ కోకోనట్ కుకీస్ ఎలా చేసుకోవాలి అంటే …!

-

అసలే వేసవి కాలం. ఆపై లాక్ డౌన్ .పిల్లలు అందరు ఇంట్లో ఉండి బోర్ గా ఫీలవుతారు. బేకరీ నుంచి తెచ్చిన ఫుడ్స్ బాగా అలవాటు పడి ఇంట్లో మీరు చేసిన వంటలు తినడం లేదా? అయితే ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త వెరైటీగా బేకరీ కుకీస్ లాగా ఇంట్లోనే ఎగ్ లెస్ కోకోనట్ కుకీస్ చేసి పెట్టండి. క్రిస్పీగా ఉండే వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

కోకోనట్ కుకిస్ తయారీకి కావలసిన పదార్థాలు: 1 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ¾ కప్పు పంచదార పౌడర్, ½ కప్పు ఎండు కొబ్బరి పొడి, బేకింగ్ పౌడర్ ½ స్పూన్, మూడు స్పూన్ల పాలు.

తయారీ విధానం: ఒక బౌల్ తీసుకుని అందులో షుగర్ పౌడర్ వేసి కరిగించుకొన్న నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి. తరువాత మైదా, ఎండు కొబ్బరి పొడి, బేకింగ్ సోడా వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా పాలు పోస్తూ పిండిని మెత్తగా ముద్దలాగా కలపాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో ఒక స్టాండ్ పెట్టి ఫ్రీ హీట్ చేసుకోవాలి. అది వేడయ్యే లోపు ఈ పిండి మిశ్రమాన్ని బిస్కెట్ ల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక ప్లేట్ లో నెయ్యి రాసి పైన పిండి వేయాలి. కలిపిన పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న బిస్కెట్ ల్లాగా చేసి కొబ్బరి పొడి అద్దాలి. తరువాత నెయ్యి రాసిన ప్లేట్ లో పెట్టి హీట్ అయిన పాన్లో ఉంచిన స్టాండ్ మీద ఈ ప్లేట్ పెట్టి మూత వేసి సన్నని మంట మీద 30 నిమిషాలు ఉడికించాలి. ముప్పై నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ తీయాలి .అంతే ఎంతో టేస్ ఎగ్ లెస్ కోకోనట్ కుకీస్ రెడీ

పోషక విలువలు: కేలరీస్ 650, ప్రోటీన్ 7.5g, ఫాట్ 65g, కార్బోహైడ్రేట్స్ 25g, పైబర్ 18g.

Read more RELATED
Recommended to you

Latest news