మాలోకం ఇలా అయితే ఎలా చెప్పు: విజయసాయి

-

అమరావతి ప్రాంత రైతులు ఉద్యమం నేపధ్యంలో ఆ ప్రాంతంలో కొందరు రాజధాని కోసం ప్రాణాలు కోల్పోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గుండెపోటు తో నిన్న ఇద్దరు మరణించారు. రాజధాని తరలిపోతుంది అనే ఆవేదనలో వారు మరణించారు అని తెలుగుదేశం పార్టీ నేతలు అంటున్నారు. అధికార పార్టీని లక్ష్యం చేసుకుని విమర్శలు చేస్తున్నారు. దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యులు వీ విజయసాయి రెడ్డి స్పందించారు.

ysrcp mp vijayasai reddy
ysrcp mp vijayasai reddy

బాబు నుండి అవినీతి, అసమర్ధత, అసత్యం వారసత్వంగా తీసుకున్న చినబాబు, ఇప్పుడు బాబునే మించిపోయాడు. వయో భారంతో సంభవించే సహజ మరణంను కూడా తన రియల్‌ ఎస్టేట్ అడ్డా అమరావతి లిస్టులో వేసే దుష్ట ప్రచారానికి దిగాడు. తండ్రిలానే మాలోకం మతి చెడిపోయింది. ఇంకెంత కాలం అవుట్‌ డేటెడ్ బుర్ర వాడుతావు మాలోకం? అని విజయసాయి ట్వీట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news