కొత్త ఫోన్ కొన్నారా..? పాత ఫోన్ నుంచి వాట్సాప్ మెసేజ్‌ల‌ను ఇలా ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోండి..

-

స్మార్ట్‌ఫోన్ల‌ను ఉప‌యోగించే ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌స్తుతం వాట్సాప్ వాడుతున్నారు. అయితే కొత్త ఫోన్ కొన్న‌ప్పుడ‌ల్లా వాట్సాప్‌ను అందులో ఇన్‌స్టాల్ చేస్తే.. పాత ఫోన్‌లో ఉండే మెసేజ్‌ల‌ను చాలా మంది పొంద‌లేక‌పోతున్నారు. దీంతో పాత ఫోన్‌లో ఉండే వాట్సాప్ మెసేజ్‌లు అలాగే డిలీట్ అయిపోతున్నాయి. కానీ కింద తెలిపిన ప‌ద్ధ‌తులు పాటిస్తే.. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్‌లో ఉండే వాట్సాప్ మెసేజ్‌ల‌ను సుల‌భంగా బ్యాక‌ప్ తీసుకుని వాటిని కొత్త ఫోన్ల‌లోకి సుల‌భంగా ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. దీంతో పాత ఫోన్‌లో ఉండే వాట్సాప్ మెసేజ్‌లు కూడా కొత్త ఫోన్ల‌లోకి వ‌స్తాయి. అందుకు ఏం చేయాలంటే…

how to transfer your whatsapp chat messages in old phone to new phone

ఆండ్రాయిడ్ ఫోన్ల‌ను వాడేవారు…

* పాత ఫోన్‌లో వాట్సాప్‌ను ఓపెన్ చేసి అందులో కుడి వైపు పై భాగంలో మూల‌న ఉండే మూడు డాట్స్‌ను ప్రెస్ చేయాలి.
* అనంత‌రం వ‌చ్చే సెట్టింగ్స్‌లో చాట్స్‌లోకి వెళ్లాలి.
* అక్క‌డ ఉండే చాట్స్ బ్యాక‌ప్‌ను ఎంచుకోవాలి.
* ఫోన్‌లోని వాట్సాప్ చాట్స్‌ను మాన్యువ‌ల్‌గా లేదా ఆటోమేటిగ్గా నిర్దిష్ట‌మైన కాల వ్య‌వ‌ధికి ఒక‌సారి బ్యాక‌ప్ తీసుకోవ‌చ్చు. రోజు వారీగా, వారానికి ఒక‌సారి, నెల‌కు ఒక‌సారి వాట్సాప్ చాట్ ఆటోమేటిగ్‌గా బ్యాక‌ప్ అయ్యేలా సెట్ చేసుకోవ‌చ్చు. దీంతో వాట్సాప్ యాప్ ఆటోమేటిగ్గా చాట్స్‌ను బ్యాక‌ప్ తీస్తుంది. అదే మాన్యువ‌ల్ బ్యాక‌ప్ అయితే యూజ‌ర్లు నిర్దిష్ట‌మైన స‌మ‌యానికి ఒక‌సారి వారే స్వ‌యంగా బ్యాక‌ప్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా బ్యాక‌ప్ తీసుకున్న చాట్ డేటా గూగుల్ డ్రైవ్‌లో సేవ్ అయ్యేలా సెట్ చేసుకోవ‌చ్చు. ఈ క్ర‌మంలో కొత్త ఫోన్ తీసుకున్నాక వాట్సాప్ ఇన్‌స్టాల్ చేసి దాన్ని ఓపెన్ చేయ‌గానే.. చాట్ డేటా రిస్టోర్ చేసుకోమ‌ని అడుగుతుంది. అప్పుడు గూగుల్ డ్రైవ్‌ను ఎంచుకుంటే చాలు.. అందులో అంత‌కు ముందు బ్యాక‌ప్ తీసిన పాత ఫోన్‌లోని వాట్సాప్ చాట్ డేటా సెలెక్ట్ అవుతుంది. అనంత‌రం ఆ డేటా మొత్తం కొత్త ఫోన్‌లోకి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో పాత ఫోన్‌లో ఉండే వాట్సాప్ చాట్ మెసేజ్‌లు కొత్త ఫోన్‌లో క‌నిపిస్తాయి. ఇలా పాత ఫోన్ల‌లోని వాట్సాప్ మెసేజ్‌ల‌ను కొత్త ఫోన్ల‌లో యాక్సెస్ చేయ‌వ‌చ్చు.

ఐఫోన్లు అయితే…

ఇక ఐఫోన్ల‌లో వాట్సాప్‌ను వాడేవారికి గూగుల్ డ్రైవ్ అందుబాటులో ఉండ‌దు. క‌నుక వారు యాపిల్ ఐక్లౌడ్‌ను బ్యాక‌ప్‌కు ఎంచుకోవాలి. అందుకు ముందుగా యాపిల్ ఐడీతో ఐక్లౌడ్ సెట‌ప్ చేసి లాగిన్ అవ్వాలి. త‌రువాత పైన తెలిపిన విధంగా య‌థావిధిగా పాత ఐఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేసి అందులో చాట్స్‌లోకి వెళ్లి డేటాను బ్యాకప్ తీయ‌వ‌చ్చు. అప్పుడు యూజ‌ర్లు ఐక్లౌడ్‌లో స‌ద‌రు డేటాను సేవ్ చేసుకోవ‌చ్చు. త‌రువాత కొత్త ఐఫోన్‌లో వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేసి దాన్ని ఓపెన్ చేశాక‌.. డేటా రీస్టోర్ ఆప్ష‌న్ వ‌ద్ద ఐక్లౌడ్‌ను ఎంచుకోవాలి. దీంతో అందులో ఉన్న వాట్సాప్ డేటా కొత్త ఐఫోన్‌లోకి వ‌స్తుంది. ఇలా పాత ఐఫోన్ నుంచి వాట్సాప్ డేటాను కొత్త ఐఫోన్‌లో సుల‌భంగా పొంద‌వ‌చ్చు.

అయితే యూజ‌ర్లు అప్ప‌టి వ‌రకు ఆండ్రాయిడ్ ఫోన్ వాడి ఐఫోన్ తీసుకున్నా, లేదా ఐఫోన్ వాడి ఆండ్రాయిడ్ ఫోన్‌కు మూవ్ అయినా.. పైన తెలిపిన ప‌ద్ధ‌తి ప‌నికిరాదు. క‌నుక ఆ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఇక ఇవే కాకుండా మ‌రో మెథ‌డ్ కూడా ఆండ్రాయిడ్‌కు ఉంది. అదేమిటంటే…

ఆండ్రాయిడ్ ఫోన్‌ను యూఎస్‌బీ కేబుల్ ద్వారా కంప్యూట‌ర్‌కు క‌నెక్ట్ చేసి అందులో ఫోన్ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌లో ఉండే వాట్సాప్ ఫోల్డ‌ర్‌కు వెళ్లాలి. అందులో వాట్సాప్ డేటాబేస్ అనే ఫోల్డ‌ర్ క‌నిపిస్తుంది. ఆ ఫోల్డ‌ర్‌లో మీ ఫోన్‌లోని వాట్సాప్ చాట్స్ బ్యాక‌ప్ ఉంటుంది. ఆ ఫైళ్ల‌లో లేటెస్ట్ ఫైల్‌ను కాపీ చేసుకుని కంప్యూట‌ర్‌లో ఎక్క‌డైనా సేవ్ చేయాలి. త‌రువాత కొత్త ఫోన్‌ను కనెక్ట్ చేసి అందులో అదే ఫోల్డ‌ర్‌కు వెళ్లాలి. ఆ ఫోల్డ‌ర్‌లో అంత‌కు ముందు పీసీలో సేవ్ చేసిన వాట్సాప్ బ్యాక‌ప్ ఫైల్‌ను కాపీ చేసి పేస్ట్ చేయాలి. త‌రువాత ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేస్తే అందులో ఒక నోటిఫికేష‌న్ క‌నిపిస్తుంది. వాట్సాప్ చాట్స్ బ్యాక‌ప్ ఉన్న‌ట్లు మెసేజ్ వ‌స్తుంది. దాన్ని ఎంచుకుని, రీస్టోర్ ఆప్ష‌న్ ప్రెస్ చేస్తే చాలు.. స‌ద‌రు బ్యాక‌ప్ ఫైల్‌లో ఉన్న వాట్సాప్ డేటా కొత్త ఫోన్‌లో క‌నిపిస్తుంది. ఇలా పాత ఫోన్‌లోని వాట్సాప్ డేటాను కొత్త ఫోన్‌లో పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news