డీటీహెచ్, కేబుల్‌ బిల్లులను ఆదా చేసే TRAI యాప్.. ఇలా వాడాలి..!

-

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (TRAI) ఇటీవలే చానల్‌ సెలెక్టర్‌ పేరిట ఓ నూతన యాప్‌ను ఆవిష్కరించిన విషయం విదితమే. ఈ యాప్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు అందుబాటులో ఉంది. దీన్ని ఆయా యాప్‌ స్టోర్‌ల నుంచి ఉచితంగానే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే ఈ యాప్‌ ద్వారా వినియోగదారులు తమ నెలవారీ డీటీహెచ్‌ బిల్లులను ఆదా చేసుకోవచ్చు. ఇందులో ఆయా డీటీహెచ్‌, కేబుల్‌ టీవీ ఆపరేటర్ల సర్వీసులను అందిస్తున్నారు. అయితే ఈ యాప్‌ను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

TRAI చానల్‌ సెలెక్టర్‌ యాప్‌ను ఇలా వాడండి…

1. ముందుగా యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని దాన్ని ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేయాలి.
2. యాప్‌లో ఉన్న డీటీహెచ్‌ లేదా కేబుల్‌ సర్వీస్‌ను ఎంచుకోవాలి.
3. యూజర్లు తమ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌, పాస్‌వర్డ్‌ వివరాలను ఎంటర్‌ చేసి తమకు సర్వీస్‌ అందిస్తున్న డీటీహెచ్‌ లేదా కేబుల్‌ ఆపరేటర్‌ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి. అవసరం అయితే ఓటీపీ కన్ఫర్మేషన్‌ ఇవ్వాలి.
4. లాగిన్‌ అయ్యాక యూజర్లు ప్రస్తుతం వాడుతున్న తమ డీటీహెచ్‌ లేదా కేబుల్‌ టీవీ సర్వీస్‌ సబ్‌స్క్రిప్షన్‌ వివరాలు వస్తాయి. వారు ఏ ప్లాన్‌ను ఉపయోగిస్తున్నది, దానికి నెలకు ఎంత ఖర్చవుతున్నది, ఏయే చానల్స్, ప్యాక్‌లు వారి సబ్‌స్క్రిప్షన్‌లో ఉన్నాయో.. ఆ వివరాలు తెరపై కనిపిస్తాయి.
5. వినియోగదారులు తమకు నచ్చిన ప్యాక్‌లు లేదా చానల్స్‌ను ఎంచుకుని తమ సబ్‌స్క్రిప్షన్‌ను మోడిఫై చేసుకోవచ్చు.
6. అన్ని చానల్స్‌, ప్యాక్‌ల టారిఫ్‌ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి దేనికి డబ్బు తక్కువ అవుతుందో చూసుకుని ఆ మే చానల్స్‌ లేదా ప్యాక్‌లను ఎంచుకోవచ్చు. దీంతో నెలవారీ డీటీహెచ్‌ లేదా కేబుల్‌ టీవీ బిల్లు ఆదా అవుతుంది.
7. కావల్సిన ప్యాక్‌లు లేదా చానల్స్‌ను ఎంచుకుని మోడిఫై చేశాక అవసరం అయితే మళ్లీ ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. యూజర్‌ రిజిస్టర్డ్‌ మొబైల్‌ లేదా మెయిల్‌కు ఆ ఓటీపీలు వస్తాయి.

ఈ విధంగా యూజర్లు తమ కేబుల్‌ బిల్లులను తగ్గించుకుని డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ట్రాయ్‌ చానల్‌ సెలెక్టర్‌ యాప్‌లో టాటా స్కై, ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ, డిష్‌ టీవీ, డీ2హెచ్‌, హాత్‌వే డిజిటల్‌, సిటి నెట్‌వర్క్స్‌, ఏషియానెట్‌, ఇన్‌డిజిటల్‌ తదితర డీటీహెచ్, కేబుల్‌టీవీ నెట్‌వర్క్‌ల సేవలు ఒకే వేదికపై లభిస్తున్నాయి. త్వరలోనే మరిన్ని డీటీహెచ్‌, కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌లను ఈ యాప్‌లో యాడ్‌ చేయనున్నారు. కాగా ఆయా నెట్‌వర్క్‌లకు సొంత యాప్‌లు, వెబ్‌సైట్‌లు ఉన్నా.. వాటిల్లో చానల్స్‌, ప్యాక్‌లను ఎంచుకోవడం కొందరు యూజర్లకు కష్టంగా మారింది. అందుకనే ట్రాయ్‌ ఈ చానల్‌ సెలెక్టర్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version