బ్యాంకుల్లో ఎఫ్‌డీల్లో డబ్బు పెట్టుబడి పెట్టుకుంటే.. సేఫ్టీతోపాటు వడ్డీ వస్తుందని పెడతారు. ఎఫ్.డీలో పెట్టుబడి ద్వారా అధిక వడ్డీతో పాటు టాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. సీనియర్ సిటిజన్లు ఎఫ్.డీల్లో పెట్టుబడికి ఆసక్తి చూపిస్తుంటారు. ఎఫ్.డీల్లో సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ ద్వారా పెట్టుబడి పెట్టవచ్చు. సింగిల్ అకౌంట్ అయితే గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు, జాయింట్ అకౌంట్ అయితే రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే, జాయింట్ ఖాతాలో మొత్తం డబ్బును ఒకే వ్యక్తి ముందస్తుగా విత్ డ్రా చేసుకునేందుకు అనుమతి ఉండదు. అయితే తాజాగా కొన్ని బ్యాంకులు దీనికి కొన్ని సడలింపులు ఇచ్చాయి. జాయింట్ ఎఫ్.డీలో రెండో వ్యక్తి లేనప్పటికీ మొదటి వ్యక్తి విత్డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి.
- ఐసిఐసిఐ బ్యాంక్ జాయింట్ అకౌంట్ ఎఫ్డీ విషయంలో సింగిల్ హోల్డర్‌ని ముందస్తు విత్డ్రాకు అనుమతిస్తుంది. అయితే దీని కోసం ఖాతా తెరిచే సమయంలోనే ఇద్దరి సంతకం ఉండాల్సిందే.
- హెచ్.డీ.ఎఫ్.సీ బ్యాంక్ కూడా జాయింట్ ఖాతాదారుల నిబంధనలను మార్చింది. ఇకపై జాయింట్ అకౌంట్లోని ఎఫ్‌డి అమౌంట్ ను సింగిల్ హోల్డర్ కూడా విత్ డ్రా చేసుకోవచ్చు.
- యాక్సిస్ బ్యాంక్‌లో కూడా జాయింట్ ఎఫ్.డీ హోల్డర్లు ఇద్దరూ ముందస్తు విత్డ్రాకు సమ్మతిస్తున్నట్లు బ్యాంకుకు లిఖిత పూర్వకంగా తెలియజేస్తే.. సింగిల్ హోల్డర్ కూడా విత్ డ్రా చేసుకోవచ్చు.
- జాయింట్ ఎఫ్.డీని ముందస్తుగా విత్ డ్రా చేసుకునేందుకు ఇండస్ ఇండ్ బ్యాంక్ అనుమతిస్తుంది. ఎఫ్.డీ అకౌంట్ ఓపెనింగ్ అప్లికేషన్ ఫారమ్లోనే ఈ విషయాన్ని తెలిపాల్సి ఉంటుంది.
- అనేక బ్యాంకులు ఈ ముందస్తు విత్ డ్రా ఫీచర్‌ను అందిస్తున్నప్పటికీ.. కొన్ని బ్యాంకుల్లో మాత్రం ఈ సదుపాయం లేదు. ఉదాహరణకు, ఫెడరల్ బ్యాంక్ జాయింట్ ఎఫ్డీ హోల్డర్లకు ఈ అవకాశం ఉండదు.