డెబిట్ కార్డు లేకుండా ఏటీఎం నుండి డబ్బులు ఇలా తీసుకోవచ్చు…!

-

ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్. ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. అయితే ఇటీవలనే బ్యాంక్ ఈమెయిల్ ద్వారా తన కస్టమరలకు డెబిట్ కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలో తెలియజేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…

 

చేతి లో డబ్బులు లేకపోతే ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటాం. ఏటీఎంలో డబ్బులు తీసుకోవాలంటే కచ్చితంగా డెబిట్ కార్డు ఉండాలి. ఏటీఎం కార్డు లేకుండానే డబ్బులు తీసుకునే వెసులుబాటు ఐసీఐసీఐ బ్యాంక్ కల్పిస్తోంది.

కస్టమర్స్ ఈమెయిల్ ద్వారా డెబిట్ కార్డు లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి అనేది చూస్తే…. మొబైల్ ఫోన్‌ లో ఐసీఐసీఐ బ్యాంక్ యాప్ iMobile App ద్వారా సులభం గానే ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు అని బ్యాంక్ అంది.

సమీపం లో వున్నా ఏటీఎం కి వెళ్లి అక్కడ ఏటీఎంలో కార్డ్‌లెస్ విత్‌డ్రా అనే ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు తీసుకోవడ వల్ల కార్డ్ స్కిమ్మింగ్ మోసాల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఏటీఎం పిన్ అవసరం ఉండదు. అదే విధంగా చార్జెస్ కూడా పడవు.

ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే కాకుండా ఇంకా పలు రకాల బ్యాంకులు కూడా తమ కస్టమర్లకు కార్డ్ లెస్ ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సర్వీసులు ఇస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కూడా యోనో యాప్ ద్వారా ఈ సర్వీసులు పొందవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version