ఆస్ట్రేలియాలోని ఓ పర్యాటక ప్రాంతంలో ఒక పెద్ద మొసలి హల్ చల్ చేసింది. ఫ్లోరా రివర్ వద్ద ఓ పెద్ద మొసలి కనిపించింది. 4.4 మీటర్లు పొడవు, 350 కిలోల బరువున్న ఈ మొసలిని చూసి స్థానికులు భయపడ్డారు. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. రంగంలోకి దిగిన అధికారులు ఆ పెద్ద మొసలిని పట్టుకున్నారు. అనంతరం.. ఆ మొసలిని తిరిగి ఫామ్‌లోకి వదిలేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే దీనిపై సీనియర్ వైల్డ్‌లైఫ్ రేంజర్ ఒకరు మాట్లాడుతూ.. ఈ ఏడాది చిక్కిన అతి భారీ మొసలి ఇదేనని.. ఇలాంటి భారీ మొసళ్లు ఏడాదికి ఓ సారి మాత్రమే కనిపిస్తాయని చెప్పారు. ఇకపోతే ఆస్ట్రేలియా ప్రభుత్వం మొసళ్లను రక్షించేందుకు 1970లలో ఓ ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చింది. దీని వల్లే ఆస్ట్రేలియాలో మొసళ్ల సంఖ్య భారీగా పెరిగింది.